కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ కెరీర్ మళ్ళీ ఊపందుకున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటివరకు యంగ్ హీరోలతోనే అవకాశాలు అందిపుచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఈమధ్యన కాస్త డల్ అయ్యింది. కానీ కార్తికేయ 2 తో మళ్లీ అనుపమ పరమేశ్వరన్ ఫామ్ లోకి వచ్చేసింది. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ అవడంతో అదే రేంజ్ లో అనుపమకి పేరొచ్చింది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ కి అదిరిపోయే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది.
అది రవితేజ సరసన హీరోయిన్ గా అనుపమ ఎంపికైనట్లుగా సమాచారం. నిఖిల్‌తో సూర్య వర్సెస్ సూర్య చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ఆ సినిమాకి టైటిల్ గా ఈగల్ ని ఫిక్స్ చేస్తున్నారని, ఈ సినిమా కోసమే రవితేజ పక్కన హీరోయిన్ గా అనుపమ ని తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తో పాటుగా మెగాస్టర్ చిరు తో వాల్తేర్ వేరయ్య మూవీలో స్పెషల్ రోల్ చెయ్యబోతున్నారు. ఇవి పూర్తి కాగానే రవితేజ - కార్తీక్ ఘట్టమనేనిలా ఈగల్ మొదలు పెడతారని తెలుస్తుంది.