Advertisementt

ఇండియన్ 2 పై బిగ్గెస్ట్ అప్ డేట్

Thu 15th Sep 2022 12:18 PM
indian 2 movie,kamal haasan,shankar  ఇండియన్ 2 పై బిగ్గెస్ట్ అప్ డేట్
Biggest update on Indian 2 ఇండియన్ 2 పై బిగ్గెస్ట్ అప్ డేట్
Advertisement
Ads by CJ

కమల్ హాసన్- శంకర్ కాంబోలో భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారతీయుడు 2 షూటింగ్ మొదలైన కొన్నేళ్ల తర్వాత మరోసారి సెట్స్ లోకి వెళ్ళింది. ఇండియన్ 2 షూటింగ్ కొద్దిమేర పూర్తయ్యాక సెట్స్ లో జరిగిన ప్రమాదం కారణంగా.. ఆ షూటింగ్ నిలిచిపోగా.. కమల్ హాసన్ ఈ గ్యాప్ లో విక్రమ్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. తర్వాత శంకర్ కూతురి పెళ్లి, అలాగే రామ్ చరణ్ RC15 తో సెట్స్ మీదకెళ్లారు. అనుకోకుండా మళ్ళీ ఈ నెలలోనే ఇండియన్2 ని పట్టాలెక్కించారు. సినిమా మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టినప్పటినుండి ఏదో ఒక అప్ డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

తాజాగా భారతీయుడు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కి సిద్ధం చెయ్యడమే కాదు, ఏకంగా 14 భాషల్లో సినిమాని విడుదల చెయ్యడానికి మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఇండియాలోని 14 లాంగ్వేజెస్ లో భారతీయుడు 2 విడుదల కాబోతుంది అంటున్నారు. మరి కమల్-శంకర్ కాంబో అంటేనే విపరీతమైన అంచనాలు. ఆ అంచనాలతోనే సినిమాని పలు భాషల్లో విడుదల చేసేందుకు చూస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ తో పాటుగా రకుల్ ప్రీత్ కూడా నటిస్తుంది.

Biggest update on Indian 2:

Kamal Haasan indian 2 update