బాలీవుడ్ స్టార్ హీరో తనకున్న క్రేజ్ సరిపోదు అన్నట్టుగా మొన్నామధ్యన ఓ న్యూడ్ ఫోటో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అప్పట్లో అది పెను సంచలనంగా మారింది. రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ పై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే.. మరికొంతమంది విమర్శలు చేసారు. ముంబై పోలీస్ లు ఏకంగా రన్వీర్ సింగ్ పై కేసు కూడా నమోదు చేసారు. విచారణకు పిలిచినప్పుడు రావాలంటూ రన్వీర్ సింగ్ కి సమన్లు కూడా పంపారు.
అయితే తాజాగా రన్వీర్ సింగ్ ని పోలీస్ విచారణకు పిలవగా.. రన్వీర్ సింగ్ పోలీస్ లకే ట్విస్ట్ ఇచ్చే వాంగ్మూలం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. తన ఫొటోస్ లో ఒకదానిని ఎవరో మార్ఫింగ్ చేసారని, ఆ న్యూడ్ ఫొటోకి తనకి ఎలాంటి సంబంధం లేదని ట్యాపరింగ్ చేసి, మార్ఫింగ్ చేశారంటూ రణవీర్ సింగ్ పోలీస్ వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది.