మిల్కి బ్యూటీ తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ త్వరలోనే ఓటిటి ద్వారా రిలీజ్ కాబోతుంది. తెలుగులో మిల్కి బ్యూటీకి అవకాశాలు తగ్గినట్టుగా అనిపించినా.. మిగతా భాషల్లో తమన్నా బిజీగానే కనిపిస్తుంది. ఈమధ్యన ఎయిర్ పోర్ట్ లుక్స్ లో, గ్లామర్ ఫోటో షూట్స్ తో మీడియా అటెన్షన్ తనవైపే తిప్పుకుంటున్న తమన్నా తాజాగా మధుర్ భండార్కర్ తో కలిసి హైదరాబాద్ కి వచ్చింది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. వచ్చే శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్న బబ్లీ బౌన్సర్ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా, మధుర్ భండార్కర్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో తమన్నా, మధుర్ భండార్కర్ మాట్లాడిన తర్వాత ఫోటో గ్రాఫర్స్ తమన్నా ఫొటోస్ క్లిక్ మనిపించారు. తమన్నా ఫోటో షూట్ తర్వాత బయటికి వస్తున్న ఫోటో గ్రాఫర్స్ పై తమన్నా బౌన్సర్స్ దాడికి యత్నించడం అందరిని షాక్ కి గురి చేసింది. బౌన్సర్స్ కి మీడియా వారికీ మధ్యన గొడవ జరగడంతో ఇద్దరు కెమెరా మ్యాన్స్ కి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇంతలో చిత్ర బృందం ఎంటర్ అయ్యి మీడియా వారికి సర్దిచెప్పి ఈ గొడవ జరిగినందుకు బాధపడుతున్నట్టుగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.