పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన చిన్న రోల్ చేసేందుకైనా హీరోయిన్స్ రెడీ అయిపోతారు. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్స్ తోనే ఎక్కువగా రొమాన్స్ చేస్తున్నారు. సలార్ లో శృతి హసాన్, ప్రాజెక్ట్ K లో దీపికా పడుకొనే, దిశా పటాని లతో రొమాన్స్ చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ లో కృతి సనన్ తో కలిసి నటించారు. ఇక సందీప్ వంగా స్పిరిట్ లోను కరీనా కపూర్ ని హీరోయిన్ గా ఫైనల్ చేయబోతున్నారనే న్యూస్ ఉంది. అయితే ఈమధ్యనే హిందీలో హిట్ కొట్టినప్పటికీ, గతంలో బాలీవుడ్ సీరియల్స్ (కుంకుమ భాగ్య)లో సిస్టర్ కేరెక్టర్స్ చేసి హిందీ ఆడియన్స్ కి దగ్గరైన మృణాల్ ఠాకూర్ కి ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది.
ఏ సినిమాలో ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ నటించబోతుంది అనే ఆసక్తి అప్పుడే మొదలైపోయింది కదా.. మృణాల్ ఠాకూర్ ప్రభాస్ తో కలిసి కనబడబోయేది మారుతీ తో చేసే ప్రాజెక్టు లో. సీతా రామం లో సీత గా అద్భుతంగా అభినయం చూపించిన ఈ బ్యూటీ ప్రభాస్ తో కలిసి మారుతి ప్రాజెక్ట్ లో మెరవబోతుననట్లుగా తెలుస్తుంది. అలాగే కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహన్ కూడా ఈ సినిమాలో ప్రభాస్ కి వన్ అఫ్ ద జోడిగా నటిస్తుంది అనే టాక్ ఉంది. మరి సీతా రామం బ్యూటీ మృణాల్ హైట్, ఆమె లుక్స్.. ప్రభాస్ హైట్, ప్రభాస్ ఆహార్యానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనడంలో సందేహమే లేదు.