మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం తాను నటించిన బబ్లీ బౌన్సర్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కి వచ్చింది. నిన్న శనివారం అన్నపూర్ణ స్టూడియోస్ జరిగిన మీడియా మీట్ లో తమన్నా బౌన్సర్లు కెమెరా మ్యాన్స్ మీద దాడి చెయ్యడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ హాట్ స్టార్ వేదికగా ఓటిటి లో ఈ నెల 23 న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా టాలీవుడ్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చింది. బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున తమన్నాని టీజ్ చేసారు. నాగార్జున మాట్లాడుతూ తమన్నా ఏంటి ఆ ట్రాన్స్ ఫర్మేషన్.. ఎక్కడ కొడతావో అని భయం వేస్తుంది అంటూ ఫన్నీగా అడిగారు. అమాయకత్వం ఒక కేరెక్టర్ లో చూపించడం చాలా డిఫ్ కల్ట్ అన్న తమన్నాతో అవును నీకది లేదుగా అంటూ టీజ్ చెయ్యడం బిగ్ బాస్ ప్రోమోలో హైలెట్ అయ్యింది.
తమన్నా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టగానే.. హౌస్ మేట్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అబ్బాయిలు, అమ్మాయిలని బాక్ససర్స్ గా ఎంచుకోమనగానే చంటి ఫైమా ని ఎంచుకున్నాడు. తర్వాత రాజ్ పై కామెడీ చేసాడు చంటి. ఎక్కడ రాజ్ ఫైమాకి బ్యాండ్ పెడతాడో అనగానే ఎందుకు అన్నారు నాగ్.. రాజ్ ఎవరికీ భయపడడు, కానీ ఫైమా కి భయపడతాడు. అందుకే దుప్పటి కప్పుకుంటాడు.. అంటూ చంటి కామెడీ చెయ్యగా.. అర్జున్ కళ్యాణ్ నా మదిలో ఇద్దరు సత్య-గీతు ఉన్నారు. అనగానే సత్య మీద అర్జున్ ఫీలింగ్స్ చూసిన ఆడియన్స్ ఏదో ఉంది అంటూ అరిచేసారు. నాగ్ కూడా ఏంటి అర్జున్ అనగానే ఏం లేదు సర్ నాకు సత్య మంచి ఫ్రెండ్ మాత్రమే అన్నాడు. ఇక రేవంత్ అర్జున్ ని ఉద్దేశించి కమల్ హాసన్ అంటూ కామెడీ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.