Advertisementt

బిగ్ బాస్ 6: గీతు vs హౌస్ మేట్స్

Mon 19th Sep 2022 03:37 PM
bigg boss 6,geetu,chanti  బిగ్ బాస్ 6: గీతు vs హౌస్ మేట్స్
Bigg Boss 6: Geetu vs Housemates బిగ్ బాస్ 6: గీతు vs హౌస్ మేట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు కంప్లీట్ చేసుకుంది. ఇద్దరిని హౌస్ నుండి బయటికి పంపేసి.. మిగతా హౌస్ మేట్స్ ఆనందంగా ఉంటామంటే బిగ్ బాస్ ఊరుకుంటాడా.. మళ్ళీ నామినేషన్స్ రచ్చ తగిలించి మంట పెట్టడం ఖాయం. ఇప్పుడదే జరిగింది. మూడో వారం నామినేషన్స్ పర్వం మొదలయ్యింది . హౌస్ మేట్స్ మధ్యన రగడ స్టార్ట్ అయ్యింది. ముందుగా శ్రీ సత్య ఇనాయని ని నామినేట్ చెయ్యగానే ఇనాయ సత్య పై ఫైర్ అయ్యింది. నాగ్ చెప్పినట్టుగా సత్యకి గేమ్ ఆడాలని లేదు అంటూ ఇనాయ పాయింట్ అవుట్ చేసింది. దానితో సత్య గొడవ పడింది. 

తర్వాత గలాటా గీతు కి సుదీప కి మధ్యన చర్చ జరిగింది. గీతూ ని నామినేట్ చేసిన చంటి తో సంస్కారం విషయంలో గీతు గొడవ పడింది. గీతు ని నామినేట్ చేసిన ఇనయతో గీతు కూడా ఫుల్ గా గొడవేసుకుంది.. ఇనాయ కూడా తగ్గలేదు. నువ్ దొబ్బెయ్ అంటే నువ్ దొబ్బెయ్ అనుకున్నారు. ఒకొనొక సమయంలో గీతూ vs హౌస్ మేట్స్ అన్న రేంజ్ లో గొడవ జరిగింది. ఆది రెడ్డి మీరు బిగ్ బాస్ ని చదివేసి వచ్చారంటూ ఇనాయ అడిగింది. అందరూ బిగ్ బాస్ గురించి తెలుసుకునే వచ్చారు.. ఇక్కడ ఎవరికి తెలియదంటే నమ్మరు, మీకు తెలియకుండానే హౌస్ లోకి అడుగు పెట్టారా అంటూ ఆది రెడ్డి గొడవపడిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Bigg Boss 6: Geetu vs Housemates:

Bigg Boss 6 Today nominations heat 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ