ఈ మధ్య కాలంలో రిలీజ్ డేట్స్ వ్యవహారంలో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏ సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాలి, ఏ సినిమాని ఒక రోజు ముందు వెయ్యాలి, ఏ సినిమాని ఆపాలి, మన రెవిన్యూని మనమే కిల్ చేసుకోకూడదు అంటూ గైడ్ చేస్తున్న యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సడన్ గా ఉన్నట్టుండి.. దుప్పటి ముసుగెట్టి పడుకుంది. అక్టోబర్ 5 న అటు మెగాస్టార్ సినిమా గాడ్ ఫాదర్, ఇటు నాగార్జున ద ఘోస్ట్ అదే డేట్ కి వస్తాను అని అంటున్నారు. నాగార్జున-చిరంజీవి ఎంతటి ఫ్రెండ్సో మనకి తెలిసిందే. వాళ్లిద్దరూ అనుకుంటే ఆ డేట్స్ చేంజ్ చెయ్యడం లేదా ఓ రోజు అటు ఇటు అవడం చాలా చిన్న విషయం.
అక్టోబర్ 5 శివ రిలీజ్ డేట్.. అందుకే నాగార్జున పంతంగా పట్టుదలాగా ఘోస్ట్ విషయంలో వ్యవహరిస్తున్నారు. చిరంజీవి దసరా సీజన్ ని మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా అదే డేట్ కి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. కార్తికేయ 2 సినిమా విషయంలో ఒకే వీక్ రెండు సినిమాలు పడకూడదు అని ఆపి, ఒకే రోజు రెండు సినిమాలు పడకూడదని ఆపి అంత పద్దతిగా వ్యవహరించేసిన యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్స్.. ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోలని చూసి ఎందుకు నోర్ముసుకుంది. ఎందుకు అటువంటి సెటిల్మెంట్ చేయలేకపోతోంది.