బిగ్ బాస్ సీజన్ 6 లో ఎలాగైనా గెలవాలనే తపనతో టాస్క్ పెరఫార్మెన్స్ లోను, మాట్లాడే విధానంలో హౌస్ మేట్స్ ని తెగ ఇబ్బంది పెడుతున్న గలాటా గీతు.. నిన్న నామినేషన్స్ టైం లో వాదించడానికి అలిసిపోయేలా చేసారు ఆమెని నామినేట్ చేసినవారు. సుదీప ని ఏడుస్తూ టిష్యు పేపర్స్ డస్ట్ బిన్ లో వెయ్యని కారణంగా నామినేట్ చెయ్యడంతో.. సిల్లీగా నామినేట్ చేస్తున్నావంటే నీ బుద్ది ఎక్కడుందో అర్ధమయ్యింది అంది సుదీప. తర్వాత గీతు చంటి నామినేషన్స్ టైం లో చంటి సంస్కారం లేదు గీతుకి అని పాయింట్ చెయ్యడంతో గీతు రెచ్చిపోయి మట్లాడేసింది. తర్వాత సుధీప వచ్చి గీతు ని నామినేట్ చేసి చాలా చక్కగా మాట్లాడింది. నా బ్లడ్, నా బిడ్డ పోతే ఆ నొప్పి నాకే తెలుస్తుంది. ఆ ఎమోషన్ నీకు తెలియట్లేదేమో అంటూ గీతు కి క్లాస్ ఇచ్చింది.
దానితో సోషల్ మీడియాలో సుదీపని మెచ్చుకుంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ చాలా చక్కగా స్ట్రాంగ్ గా కౌంటర్ వేసింది సుదీప అంటుంటే.. గీతు ని మాత్రం తిట్టి పోస్తున్నారు నెటిజెన్స్. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసి ఏం చేసినా చెల్లుద్ది అనుకున్నావా.. నీకు మర్యాద కూడా తెలియదు. ఇనయతో గొడవ పడేటప్పుడు దొబ్బెయ్ అంటూ మాట్లాడావ్ నీకు చంటి చెప్పినట్టుగా సంస్కారం ఉందా అంటూ గీతు ని ఆడేసుకుంటున్నారు నెటిజెన్స్.