Advertisementt

బిగ్ బాస్ అంతా మోసం: అభినయ

Tue 20th Sep 2022 11:24 AM
bigg boss,abhinaya,big boss telugu 6  బిగ్ బాస్ అంతా మోసం: అభినయ
Bigg Boss is all a scam: Abhinaya బిగ్ బాస్ అంతా మోసం: అభినయ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో చివరి వరకు ఉంటే ఒకలాగా అదే మొదటి రెండు మూడు వారాల్లో ఎలిమినేట్ అయితే ఒకలాగా మాట్లాడడం అనేది కంటెస్టెంట్స్ కి ఉన్నఅలవాటే. కానీ బిగ్ బాస్ విన్నర్స్ కూడా బిగ్ బాస్ వలన ఉపయోగమే లేదని చెబుతూ కామెంట్స్ చెయ్యడం వస్తున్నా, రాబోతున్న సీజన్స్ పై ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటినుండి మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ అయ్యేవారు బిగ్ బాస్ పై దుమ్మెత్తిపోతున్న విషయం తెలిసిందే. నటి హేమ, కరాటే కళ్యాణి, రీసెంట్ గా అభినయశ్రీ. అయితే ఫస్ట్ వారం ఎలిమినేషన్ తప్పించుకుని రెండో వారం ఎలిమినేట్ అయినపోయిన అభినయ బయట యూట్యూబ్ ఛానల్స్ లో బిజీగా కనిపిస్తుంది. 

అంతేకాకుండా రెండో వారం బయటికి రావడంతో బిగ్ బాస్ అంతా మోసం, గంట షోలో తనని కనీసం ఐదు నిమిషాలు కూడా చూపించలేదని.. తనకు బిగ్ బాస్ అన్యాయం చేశారని.. బిగ్ బాస్‌షో వల్ల తనకి సెకండ్ ఇన్నింగ్స్ మంచిగా జరుగుతుంది అనుకుంటే తనకు బ్యాడే జరిగిందని అని అంటుంది. అంతేకాకుండా రెమ్యూనరేషన్ పెద్దగా ఇవ్వలేదని అన్నారు.. తనకంటే తక్కువగా ఓట్లు వచ్చిన వారిని హౌజ్‌లో ఉంచారని.. ఇది మాత్రం అన్యాయమంటూ అభినయ వాపోతుంది, అభినయకి కనీసం బిగ్ బాస్ జర్నీ అయినా వేసి చూపించారు.. కానీ షాని కి అది కూడా లేదు.. సాదాసీదా గా ఎలిమినేట్ చేసేసి నాగ్ చేతులు దులిపేసుకున్నారు.

Bigg Boss is all a scam: Abhinaya:

Abhinaya comments on Bigg Boss 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ