ఏ అమ్మాయిని నమ్ముకుని? అసలు ఆగమైంది ఎవరు? అని అనుకుంటున్నారా? ఆగమైన అబ్బాయి నెట్రోస్టార్ సుధీర్ బాబు. ఆగం చేసిన ఆ అమ్మాయి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అర్థం కాలేదా.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటించిన కృతిశెట్టి. ఈ భామకి ‘ఉప్పెన’ తప్ప.. ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా హిట్ పడలేదు. ఇప్పుడామె పాత్రనే బేస్ చేసుకుని టాలెంటెడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ సినిమా చేశాడు. ఆ సినిమా పేరే.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమా రీసెంట్‌గా విడుదలై, ఎటువంటి టాక్‌ని సొంతం చేసుకుందో తెలిసిందే. మొదటి రోజు, మొదటి ఆట నుండే ఇది థియేటర్ సినిమా కాదు.. ఓటీటీ సినిమా అనేలా విశ్లేషకులు, విమర్శకులు తేల్చేశారు. అయితే ఈ సినిమాతో హీరో సుధీర్ బాబు కూడా బాగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది.
మైత్రీ మూవీ మేకర్స్‌తో బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రానికి బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మాతలు. వీరితో పాటు హీరో సుధీర్ బాబు కూడా ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఆయన కూడా కొంత మేర పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తుంది. మోహనకృష్ణ ఇంద్రగంటిపై ఉన్న నమ్మకంతో బడ్జెట్‌లో మేజర్ పార్ట్ సుధీర్ బాబుదే అని టాక్. సుమారు 6 కోట్ల వరకు ఈ సినిమాకు బడ్జెట్ అయిందని, అందులో 10 శాతం కూడా వెనక్కి తిరిగిరాలేదని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్న టాక్. ఇంకా ఈ చిత్రానికి శాటిలైట్ బిజినెస్ కూడా జరగలేదని తెలుస్తుంది. అదేమైనా పూర్తయితే మాత్రమే.. నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.. లేదంటే ఈ అమ్మాయితో వారు ఆగమాగమైనట్లేనని.. ఇండస్ట్రీ పీపుల్ అనుకుంటున్నారు.