Advertisementt

చూపుతిప్పుకోనివ్వని త్రిష అందం

Sat 24th Sep 2022 11:52 AM
trisha,trisha krishnan,ps 1 movie  చూపుతిప్పుకోనివ్వని త్రిష అందం
Trisha in Black saree చూపుతిప్పుకోనివ్వని త్రిష అందం
Advertisement
Ads by CJ

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా చలామణి అయిన త్రిష కృష్ణన్ ఈమధ్యన తెలుగులోనే కాదు.. తమిళ సినిమాల్లోనూ కనిపించడం లేదు. తెలుగులో ఆచార్య మూవీ నుండి సడన్ గా తప్పుకుని షాకిచ్చిన త్రిష విజయ్ సేతుపతి తో కలిసి నటించిన 96 క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న త్రిష మధ్యలో పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే టాక్ నడిచింది. వ్యాపారవేత్తతో త్రిషకి నిశ్చితార్ధం అయ్యింది అని, అతనితో పెళ్లి పీటలెక్కబోతుంది అని అన్నప్పటికీ .. తర్వాత త్రిష తన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంది అన్నారు.

అదంతా అలా ఉంటే త్రిష మరోసారి సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీ లో త్రిష నటించింది. ఈ నెల 30 న విడుదలకాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రిష పాల్గొంటుంది. పొన్నియన్ సెల్వన్ లో త్రిష గెటప్ చూసిన అందరూ కాప్లిమెంట్స్ ఇస్తుంటే.. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన PS1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రిష బ్లాక్ సారీ లో కుందనపు బొమ్మలా కనిపించింది. వయసు పెరుగుతున్న అందం తరగడం లేదు.. ఇంకా ఇంకా అందం పెరిగినట్లుగా కనిపించింది త్రిష మొహం. ఆమె ఫేస్ కళగా చాలా అంటే చాలా అందంగా అందరి చూపు తిప్పుకునేలా ఉంది. త్రిష పక్కన ఐశ్వర్య రాయ్ కూడా తేలిపోయింది అంటే నమ్మాలి. ఆ బ్లాక్ సారీ లో త్రిష అందాన్ని ఎంత పొగిడినా తక్కువే.

Trisha in Black saree:

Trisha Krishanan latest look viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ