బిగ్ బాస్ సీజన్ 6 మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఆమె గేమ్ విషయంలో చేసే స్ట్రాటజీలు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తన మాటే రీ సౌండ్ రావాలని కోరుకునే గీతు రాయల్‌కి పది నిమిషాల ఫుటేజ్‌లో హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో ఆమెకి 10 నిమిషాల టాగ్ వేశారు. అయితే ఆమె చేసే రచ్చ, ఆమె స్ట్రాటజీలు బుల్లితెర ప్రేక్షకులకే కాదు చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి నచ్చడం లేదు, ఆఖరికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కూడా గీతు ని త్వరగా హౌస్ నుండి పంపెయ్యమని కోరుకుంటున్నారు. అరియానా చేస్తున్న బిగ్ బాస్ కేఫ్ ఇంటర్వ్యూ కి తాజాగా జెస్సి వచ్చాడు. గత సీజన్‌లో జెస్సి కాస్త హెల్త్ ప్రాబ్లెమ్‌తో ఇబ్బంది పడ్డాడు. సిరి-షణ్ముఖ్ లతో ఫ్రెండ్ షిప్ చేసిన జెస్సి మోడల్ గా బయట పేరు తెచ్చుకున్నాడు.
తాజాగా అరియనా ఇంటర్వ్యూకి వచ్చిన జెస్సి.. ప్రస్తుతం కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో ‘అడవిలో ఆట’ గేమ్‌లో రేవంత్‌ను గెలవనివ్వకూడదని అతని బొమ్మలు నేహా, ఆరోహీలు దాచిపెట్టడం వరెస్ట్ థింగ్ అన్నాడు. గీతు గురించి చెప్పమనగానే జెస్సి ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘ఓయమ్మా.. ఎవరైనా ఆమెను పంపించేయండ్రా, అసలు ఆమెకు ఓట్లు వేయకండ్రా బాబు.. ఆమెని సేవ్ చేయకండిరా బాబు అని పోస్ట్ పెడదామనుకున్నా..’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఇక హౌస్‌లో ప్రస్తుతం వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా.. దానికి వెంటనే రాజ్ అని జెస్సి చెప్పాడు. ఎందుకంటే అతను కెప్టెన్ అయిన విధానం నచ్చలేదని చెప్పాడు. రేవంత్ ఫ్రెండ్ అర్జున్ కళ్యాణ్ పెద్ద నసగాడని, శ్రీసత్య దగ్గర డ్రామా చేస్తాడని అన్నాడు. హౌస్ లో కేవలం గీతు-శ్రీహన్-రేవంత్ మాత్రమే గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నారని జెస్సి ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.