Advertisementt

ఈ మెగా హీరో అయినా హిట్ ఇచ్చేనా?

Mon 26th Sep 2022 11:44 AM
anu immanuel,allu sirish,urvashivo rakshashivo  ఈ మెగా హీరో అయినా హిట్ ఇచ్చేనా?
Urvashivo Rakshashivo teaser releasing on Sep 29th ఈ మెగా హీరో అయినా హిట్ ఇచ్చేనా?
Advertisement
Ads by CJ

మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాలో గ్లామర్ గా రెచ్చిపోయిన అను ఇమ్మాన్యువల్ కి ఆ రెండు సినిమాలు డిజాస్టర్స్ ఇవ్వడంతో.. అను ఇమ్మాన్యువల్ కి మరో సినిమా రావడం కష్టమైపోయింది. ఏ సినిమా చూసినా పాపకి షాక్ ఇవ్వడం తప్ప సక్సెస్ ఇచ్చింది లేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత అను ఇమ్మాన్యువల్ మరో మెగా హీరోని నమ్ముకుంది. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో హీరోగా అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న అల్లు శిరీష్ తో ఉర్వశివో రాక్షసివో చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి విజేత సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. 

ప్రేమకాదంట అని మొదటి అనౌన్స్ చేసిన ఈ చిత్ర టైటిల్ ను ప్రస్తుతం ఉర్వశివో రాక్షసివో అని మార్చి అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. చిత్ర టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్, అనుఇమ్మాన్యూల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్ర టీజర్ ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. మరి అల్లు శిరీష్ అయినా అను ఇమ్మాన్యువల్ కి హిట్ ఇచ్చి ఆడుకుంటాడేమో చూద్దాం.

Urvashivo Rakshashivo teaser releasing on Sep 29th:

Allu Airish - Anu Immanuel Urvashivo Rakshashivo teaser releasing on Sep 29th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ