మెగాస్టార్ చిరంజీవి క్రీడాకారులు దేశం గర్వించే సక్సెస్ లు అందించినప్పుడు ఆయన పర్సనల్ గా తన ఇంట్లోనే విందు ఏర్పాట్లు చేసి ప్రముఖులకు, క్రీడాకారులకు పార్టీలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం, ఇండియా కి పథకాలు సాధించిన సైనా నెహ్వాల్, పివి సింధు ఇలాంటి వాళ్ళకి చిరు తన ఇంట్లోనే పార్టీలు ఇచ్చారు. ఈ పార్టీలకి నాగార్జున ఫ్యామిలీ, రానా, చాముండేశ్వరి నాథ్, మెగా ఫ్యామిలీ హీరోలు, ఫ్యామిలీ మెంబెర్స్ హాజరయ్యేవారు. అయితే మెగాస్టార్ చిరు వారసత్వాన్ని ఆయన కొడుకు రామ్ చరణ్ కంటిన్యూ చేస్తున్నాడు.
ఎందుకంటే నిన్న ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో భారత్-ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ని రామ్ చరణ్ స్వయంగా వీక్షించడమే కాదు, మ్యాచ్ గెలిపింన ఇండియా టీం ని తన ఇంటికి ఆహ్వానించి అదిరిపోయే పార్టీ ఇచ్చారని తెలుస్తుంది. ఈ పార్టీకి హార్థిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ ఇంకొంతమంది జట్టు సభ్యులు చరణ్ ఇంట్లో పార్టీ చేసుకుని సందడి చేసినట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్ తన భార్య ఉపాసన కలిసి ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఇంకొంతమంది ప్రముఖులు కూడా పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. ఈ పార్టీ మేటర్ లీక్ అవడానికి కారణం చరణ్ ఇంట్లో పని చేసే ఓ వ్యక్తి హార్దిక్ పాండ్య తో కలిసి దిగిన సెల్ఫీ. అతను ఆ సెల్ఫీ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోనే టీం ఇండియా జట్టుకి చరణ్ పార్టీ ఇచ్చారన్న విషయం బయటపడింది.