Advertisementt

బాలయ్య అన్ స్టాపబుల్ ఆంథెమ్

Tue 27th Sep 2022 09:27 PM
unstoppable 2,balakrishna,aha  బాలయ్య అన్ స్టాపబుల్ ఆంథెమ్
Unstoppable 2 Anthem elevates Balakrishna heroics బాలయ్య అన్ స్టాపబుల్ ఆంథెమ్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ని కొత్తగా కాదు సరికొత్తగా చూపించిన ఆహా అన్ స్టాపబుల్.. ఇప్పుడు సెకండ్ సీజన్ కి రెడీ అవుతుంది. బాలయ్య ఎనేర్జి లెవల్స్, ఆయన మాట తీరు వీటన్నిటిని మరోసారి చూసేందుకు నందమూరి ఫాన్స్, ఆడియన్స్ అంతా సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేసేలా చేసింది. బాలకృష్ణ చిలిపి చేష్టలు, బాలయ్య అల్లరి, ఆయన స్టయిల్, లుక్, సెలబ్రిటీస్ తో మాట్లాడే తీరుకి చిన్నా, పెద్దా అందరూ మమైమరిచిపోతున్నారు. ఈ షోకి గెస్ట్ లుగా వచ్చే సెలబ్రిటీస్ కూడా అంతే హుందాగా సరదాగా కనిపిస్తున్నారు. అందుకే సెకండ్ సీజన్ పై ఆసక్తి మరింతగా పెరిగింది. తాజాగా ఆహా నుండి అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2 టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు. రోల్ రైడా, మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ సాంగ్ ని రూపొందించారు.

ఆ సాంగ్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ లోని ఆయన స్టయిల్ ని, కొన్ని పిక్స్ ని చూపించారు. బాలయ్య బైక్ మీద హెల్మెట్ పెట్టి దిగితే ఫాన్స్ కి పూనకాలే. నేను దిగ‌నంత వ‌ర‌కే అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ టైటిల్ సాంగ్ ప‌క్కా మాసీగా బాల‌య్య ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆయ‌న ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా అంటూ రోల్ రైడా పాడిన ఈ పాట అలరిస్తుంది. ఇక సీజన్ 2 మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరు హాజరవుతారని టాక్ వినిపిస్తుండగా.. ఈ సెకండ్ సీజన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ 2 పై అంచనాలు మాములుగా లేవు. 

Unstoppable 2 Anthem elevates Balakrishna heroics:

Unstoppable 2 Anthem shows Balakrishna mass mania

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ