చిరంజీవి: శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
నందమూరి బాలకృష్ణ: ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
పవన్ కళ్యాణ్: శ్రీ కృష్ణ గారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను.
వై.కాశి విశ్వనాథ్: హీరో కృష్ణ గారి సతీమణి.. మహేష్ బాబు మాతృమూర్తి.. శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి మృతి చెందడం బాధారకరం. ఆమె మృతికి.. తెలుగు దర్శకుల సంఘం తరపున.. సంతాపం తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని.. ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.
రవితేజ: ఇందిరా దేవి గారి మరణవార్త తెలిసి బాధపడ్డాను.. కృష్ణ గారికి మహేష్ మరియు కుటుంబ సభ్యులకి హృదయపూర్వక సానుభూతి, ఇందిరగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.