Advertisementt

నాన్నమ్మ కోసం వెక్కిళ్లు పెట్టి ఏడ్చిన సితార

Wed 28th Sep 2022 12:17 PM
superstar mahesh babu,mahesh mother indira devi,mahesh daughter sitara  నాన్నమ్మ కోసం వెక్కిళ్లు పెట్టి ఏడ్చిన సితార
Mahesh Babu daughter Sitara cries grandmother Indira Devi death నాన్నమ్మ కోసం వెక్కిళ్లు పెట్టి ఏడ్చిన సితార
Advertisement
Ads by CJ

మహేష్ బాబు తల్లి , కృష్ణ గారి మొదటి భార్య ఇందిరాదేవి ఈరోజు బుధవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమెని తలుచుకుని మహేష్ ఎమోషనల్ అయ్యారు. మహేష్ బాబు కి తన తల్లితో విడదీయలేని అనుబంధం ఉంది. తల్లిని ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటారు. మహేష్ కే కాదు ఆయన పిల్లలు సితార, గౌతమ్ లకి కూడా నాన్నమ్మ ఇందిరాదేవితో మంచి అనుబంధం ఉంది. ఆమె బర్త్ డే కి కేక్ కట్ చేయించడం, ఫెస్టివల్స్ కి, ఫంక్షన్స్ కి నాన్నమ్మతో కలిసి అటెండ్ అవడం చేస్తూ ఉంటారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందిరాదేవి-కృష్ణ గారి చిన్న కూతురు, సుధీర్ బాబు వైఫ్ తల్లి మరణం జీర్ణించుకోలేక ఏడుస్తూనే కనిపించారు.

నాన్నమ్మ ఇందిరా దేవి లేరన్న నిజాన్ని మహేష్ కూతురు సితార పాప తట్టుకోలేకపోతుంది. తండ్రి ఒడిలో కూర్చుని వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తుంది. సితారని మహేష్ ఎంతగా ఓదార్చినా సితార మాత్రం ఏడుస్తున్న దృశ్యాలు చూస్తున్న అందరూ కంటతడి పెడుతున్నారు. నాన్నమ్మ అంటే ఎంత ప్రేమ. ఆమె ఇక లేరు అన్న నిజాన్ని తట్టుకోలేక సితార అంతలా వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Mahesh Babu daughter Sitara cries grandmother Indira Devi death:

Superstar Mahesh Babu Mother Passed Away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ