Advertisementt

మంత్రి రోజాకు.. దారుణ అవమానం!

Sun 02nd Oct 2022 11:36 AM
roja,jabardasth,insult,jabardasth team members,rk roja,etv,dussehra,special event  మంత్రి రోజాకు.. దారుణ అవమానం!
Roja Feels Insulted in ETV Dussehra special Event మంత్రి రోజాకు.. దారుణ అవమానం!
Advertisement
Ads by CJ

మంత్రి రోజా దారుణ అవమానానికి లోనైనట్లుగా తెలుస్తుంది. ఆమెని అవమానించింది ఎవరో కాదు.. ఆమెను బుల్లితెరపై క్వీన్‌ని చేసిన ‘బజర్ధస్త్’ బృందమే. మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా ‘జబర్ధస్త్’కి దూరమైన విషయం తెలిసిందే. ఆమె ‘జబర్ధస్త్’ని వదిలేసిన తర్వాత జడ్జ్‌లుగా ఎందరో మారారు. అయితే ‘జబర్ధస్త్’లో జడ్జ్‌గా చేసిన సమయంలో.. ఏదైనా ఫెస్టివల్ వస్తే.. స్పెషల్ కార్యక్రమాల్లో రోజా అండ్ టీమ్ చేసే హడావుడి ఎలా ఉంటుందో.. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు నిరూపించాయి. ఇప్పుడామె జడ్జిగా లేనప్పటికీ.. ఈ దసరాకి మల్లెమాల అండ్ టీమ్ ప్లాన్ చేసిన స్పెషల్ కార్యక్రమానికి అతిథిగా వచ్చింది. అయితే ఎంట్రీలో అదరగొట్టిన రోజాకి.. ఎండింగ్ మాత్రం తీవ్ర అవమానాన్నే మిగిల్చినట్లుగా తాజా ప్రోమో తెలియజేస్తుంది. 

 

ఈ స్పెషల్ ఈవెంట్‌కి సంబంధించిన ప్రోమోని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో.. ఆమె ఎంట్రీ సమయంలో ఆమెకు బీభత్సమైన హైప్ ఇచ్చిన జబర్ధస్త్ టీమ్ సభ్యులు.. వెళ్లే ముందు ఆమెని అవమానించినట్లుగా చూపించారు. ‘‘ఏం మాట్లాడుతున్నావ్.. అసలు నన్ను పిలిచింది అవమానించడానికా.. ఏంటి మీరంతా ప్లాన్ చేసుకుని నన్ను గెస్ట్‌గా రమ్మన్నారా?’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ.. మెడలో వేసిన దండను విసిరివేసి.. రోజా వెళ్లిపోతున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. అయితే, నిజంగానే ఆమెను అవమానించారా? లేదంటే.. ఇది కూడా సుధీర్, రష్మీల పెళ్లిలా పబ్లిసిటీ స్టంటా? అనేది తెలియాల్సి ఉంది. 

Click Here for Promo

Roja Feels Insulted in ETV Dussehra special Event:

Jabardasth Team members insulted Roja at Dussehra special Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ