రణబీర్ కపూర్-అలియా భట్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్ అయ్యి ఇక్కడ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. బ్రహ్మాస్త్ర పై ఉన్న అంచనాలు ఆ చిత్రం అందుకోలేకపోయినా.. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొట్టింది. బ్రహ్మాస్త్ర విడుదలైన తర్వాత సినిమాలో ఏం లేదు.. సినిమా బాలేదు అంటూ క్రిటిక్స్ విమర్శలు ఓ పక్క, ఆడియన్స్ పెదవి విరుపులు మరోపక్క ఉన్నప్పటికీ.. బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ విషయంలో కళకళలాడింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నుండి నాగార్జున, బాలీవుడ్ లో విలన్ పాత్రలో మౌని రాయ్ నటించారు.
అయితే బ్రహ్మాస్త్ర చిత్రం మూడు పార్ట్ లుగా రాబోతున్నట్టుగా దర్శకుడు అయాన్ ముఖర్జి ఎప్పుడో ప్రకటించాడు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 తర్వాత ఆడియన్స్ లో పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో అనే క్యూరియాసిటీ మొదలయ్యింది. తాజాగా ఆ క్యూరియాసిటీకి తెరదించుతూ అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 విడుదల తేదిపైనే కాదు, పార్ట్ 3 విడుదల తేదీ పై కూడా క్లారిటీ ఇచ్చేసాడు. నిజం చెప్పాలంటే బ్రహ్మాస్త్ర విడుదల తేదీలని ముందే నిర్ణయించుకున్నాము. పార్ట్ 1 విడుదలైన మూడేళ్ళకి అంటే 2025 దీపావళికి బ్రహ్మాస్త్ర పార్ట్ 2, ఆ తర్వాత ఏడాదికి పార్ట్ 3 అంటే 2026 క్రిష్టమస్ కి విడుదల చేస్తాము. ఖచ్చితంగా ఇదే డేట్స్ లో విడుదలయ్యేలా చూసుకుంటాం.. కానీ పరిస్థితుల బట్టి విడుదల తేదీలపై ఏమైనా మార్పులు ఉంటాయేమో అంటూ బిగ్ ట్విస్ట్ కూడా ఇచ్చాడు అయాన్.