బిగ్ బాస్ సీజన్ 6 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే ముగ్గురు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అందులో షాని, అభినయ, మూడో వారం నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వగా ఈ వారం పది మంది నామినేషన్స్ లో ఉన్నారు. అందులో కీర్తి అండ్ అర్జున్ కళ్యాణ్ ని నాగార్జున డైరెక్ట్ గా నామినేట్ చేసారు. ఇక రేవంత్, గీతు, ఇనయలను హౌస్ లో ఎక్కువమంది టార్గెట్ చేసి నామినేట్ చేసారు. అయినప్పటికీ.. రేవంత్ ఓటింగ్ పరంగా మొదటి స్థానంలోనే ఉంటున్నాడు. కానీ ఈ వారం ఓటింగ్ లో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. అనూహ్యంగా ఈ వారం మొదట్లో కీర్తి భట్ రేవంత్ ని క్రాస్ చేసి మొదటిస్థానంలోకి వచ్చినప్పటికీ.. మళ్ళీ రేవంత్ తనకున్న ఫాలోయింగ్ తో మొదటి స్థానంలోకి వచ్చేసినట్లుగా తెలుస్తుంది.
తర్వాత స్థానంలో కీర్తి ఉండగా.. ఎప్పుడూ రెండో ప్లేస్ లో ఉండే శ్రీహన్ మూడో స్థానానికి పడిపోగా.. ఇనాయ సుల్తానా క్రేజీగా నాలుగో స్థానంలోకి వచ్చేసింది. అర్జున్ కళ్యాణ్ కాస్త మెరుగయ్యి ఐదో స్థానంలోకి రాగా.. ఆర్జే సూర్య ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో గీతు, రాజ్ ఉన్నారు. అయితే ఈవారం డేంజర్ జోన్ లో సుదీప, ఆరోహి ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆరోహి చాలా తక్కువ ఓట్లతో చివరి ప్లేస్ లో కొనసాగుతుంది అని.. ఈ వారం సుదీప కానీ, ఆరోహి కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.