బాలీవుడ్ సీరియల్స్ లో నటించే మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సీతారామం మూవీ తో పాన్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ గా మారింది. దుల్కర్ సల్మాన్ కి పర్ఫెక్ట్ జోడిగా, అద్భుతమైన లుక్స్ తో, అందమైన రూపంతో, ఎంతో ఆకర్షణగా కనిపించిన సీత అంటే ఇలానే ఉంటుందా అన్నంత అందమైన నటనతో అందరి మనసులని దోచేసింది. తెలుగులో, తమిళంలో, మళయాళమే కాదు, హిందీ ప్రేక్షకులని కూడా ఆకర్షించింది. సీతారామం అనే అద్భుతమైన ప్రేమ కావ్యంతో అందరికి దగ్గరైంది.
సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ కి వరస ఆఫర్స్ వస్తున్నాయి. అవకాశాల సంగతి ఎలా ఉన్నపటికీ అమ్మడు నార్త్ అమ్మాయి కదా అందుకే ఇప్పుడు గ్లామర్ షో మొదలు పెట్టింది. అది అలాంటి ఇలాంటి గ్లామర్ షో కాదు.. చిట్టిపొట్టి ఫ్రాక్ లతో మృణాల్ ఠాకూర్ అందాలు ఆరబోస్తుంది. బేబీ పింక్ కలర్ ఫ్రాక్ లో క్లివేజ్ షో చేస్తూ మరీ చిన్న అమ్మాయిలా కనిపించింది. బాగ్ రౌండ్ లోను బేబీ పింక్ వాల్ ఉండడంతో ఆమె మరింతగా మెరిసిపోతుంది.