జబర్దస్త్ లో కూల్ గా కామెడీ చేసుకునే చలాకి చంటి.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కేవలం కామెడీతోనే ఆడియన్స్ తో ఓట్స్ వేయించుకుని, హౌస్ మేట్స్ మెప్పు పొందుదామనుకున్న చంటికి బిగ్ బాస్ లో జబర్దస్త్ షాక్ తగులుతోంది. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో చంటి ఘోరంగా విఫలమవడంతో గలాటా గీతు చంటి ని తీవ్రంగా విమర్శిస్తోంది. అంతేకాకుండా కీర్తిని కెమెరాల కోసం పని చేస్తుంది అంటూ కామెంట్ చేశాడంటూ చెప్పడంతో కెప్టెన్ కీర్తి చంటిని సీజన్ మొత్తం కెప్టెన్ కాకుండా చెయ్యడంతో చంటి కి బిగ్ షాక్ తగిలింది అనే చెప్పాలి. కెప్టెన్సీ టాస్క్ లో జీరో బ్యాలెన్స్ తో ఉన్న ఇనాయ, ఆది రెడ్డి, అర్జున్ కళ్యాణ్ లలో ఆది రెడ్డి సీజన్ మొత్తం కెప్టెన్ అవ్వకూడదని రేవంత్ ఒక్కడే ఓటు వేసాడు.
అర్జున్ కళ్యాణ్ కి ఎవరూ వెయ్యలేదు. ఇక ఇనాయకి మూడు ఓట్స్, చంటికి మూడు ఓట్స్ పడగా.. టై అయ్యింది. దానితో కెప్టెన్ కీర్తి ఓట్ తీసుకున్నారు నాగ్. అప్పుడు కీర్తి చంటికి ఓట్ వేసింది. ఆ దెబ్బకి సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే ఛాన్స్ ని కోల్పోయాడు చంటి. ఆ తర్వాత గీతు కి చంటికి జరిగే కోల్డ్ వార్ కాస్తా ఓపెన్ వార్ గా మారింది. ఇక తనని అలా కీర్తి ఎందుకు అన్నాడో అనే విషయంపై చంటి బాగా ఫీలయ్యాడు. దానికి రుజువు తీసుకునేందుకు కీర్తి తోనే మాట్లాడాడు. కానీ గీతు చంటి అన్నాడు అంటూ తెగేసి చెప్పింది. కామెడీ చేస్తూ వంట చేస్తే సరిపోదు గేమ్ కూడా ఆడాలా అంటూ గీతూ చంటికి చిరాకు తెప్పిస్తుంది.