కరోనా తర్వాత థియేటర్స్ లో పెరిగిన టికెట్ రేట్లతో ఆడియన్స్ ఆలోచనలో పడ్డారు. థియేటర్స్ కి వెళ్లి అంత డబ్బులు పెట్టి సినిమా చూడాలా అనే ధోరణిలోకి వెళ్లేలా చేసారు కొంతమంది. భారీ బడ్జెట్ సినిమాలు చేసాం, నష్టపోతాం అంటూ టికెట్ రేట్లు పెంచేయడంతో.. జనాలు థియేటర్స్ రావడం తగ్గించేశారు. మధ్యలో ఓటిటీలు కూడా థియేటర్స్ లో జనం తగ్గడానికి కారణమయ్యాయి. అయితే కొంతకాలంగా టికెట్ రేట్స్ తగ్గించి మా సినిమా విడుదల చేస్తున్నామంటూ ఆయా సినిమాల హీరోలు, మేకర్స్ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్పాల్సి వస్తుంది. లేదంటే పెరిగిన ధరలతో ఆడియన్స్ థియేటర్స్ కి రారని వారి భయం.
అయితే ఇప్పుడు టికెట్ రేట్స్ కట్ డౌన్ చేసారు. 150 మ్యాగ్జిమమ్ టికెట్ ప్రైస్ గా ఫిక్స్ చేసారు. మల్టిప్లెక్స్ లో కూడా 150 రూపాయలే. సోకాల్డ్ డబ్బింగ్ సినిమాకి 295 ఉంటే.. దసరాకి రాబోతున్న మన రెండు పెద్ద సినిమాలు ఘోస్ట్, గాడ్ ఫాదర్ కి కూడా 150 మ్యాగ్జిమమ్ టికెట్ రేట్ ఫిక్స్ చేసారు. ఇది ఆడియన్స్ ని థియేటర్స్ కి ఇన్వైట్ చేసే మంచి ప్రయత్నమనే చెప్పాలి. రెండు సినిమాల ఫిలిం మేకర్స్ కూడా ఒకటే మాట మీద టికెట్ రేట్స్ తగ్గించడం శుభపరిణామమే. ఏషియన్ సునీల్ నైజాం లో రెండు పెద్ద సినిమాలైన గాడ్ ఫాదర్, ఘోస్ట్ కి థియేటర్స్ ని కరెక్ట్ గా అంటే సమానంగా ఎలాట్ చేస్తున్నారు. అలాగే ప్రేక్షకులకి టికెట్ రేట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఖచ్చితంగా ఈ దసరా మన తెలుగు సినిమా పరిశ్రమకి మంచి ఫలితాన్నిస్తుంది అని ఆశించొచ్చు.