Advertisementt

గంగానది తీరంలో మహేష్ బాబు

Sun 02nd Oct 2022 10:57 PM
mahesh babu late indira devi,haridwar  గంగానది తీరంలో మహేష్ బాబు
Mahesh Babu has immersed his mother, Late Indira Devi gari ashes గంగానది తీరంలో మహేష్ బాబు
Advertisement
Ads by CJ

సూపర్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి శ్రీమతి ఇందిరాదేవిగారు ఈమధ్యనే కాలం చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఇందిరాదేవి హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇందిరాదేవిగారి మరణం ఘట్టమనేని ఫ్యామిలీని సోకసముద్రంలోకి తోసేసింది. కన్నతల్లి మరణం తో మహేష్ కుంగిపోగా.. ఆయన కూతురు సితార నాయనమ్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. సూపర్ స్టార్ కృష్ణ కూడా భార్య మరణంతో కన్నీటి పర్యంతమయ్యారు.

మహేష్ బాబు తల్లికి తలకొరివి పట్టి హిందూ ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇందిరాదేవిగారు మరణించడంతో కృష్ణగారిని, మహేష్ ని పలకరించడానికి చాలామంది ప్రముఖులు పద్మాలయ స్టూడియోస్ కి వచ్చారు. అయితే ఈరోజు ఇందిరాదేవిగారు మరణించి ఐదురోజులు అవడంతో హరిద్వార్ లో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవిగారి అస్థికలు గంగానదిలో కలిపారు. హరిద్వార్ కి మహేష్ బాబు కి తోడుగా తల్లి అస్తికలు కలపడానికి మహేష్ చిన్నాన్న ఆదిశేషగిరి రావు వెళ్లారు.

Mahesh Babu has immersed his mother, Late Indira Devi gari ashes:

Mahesh Babu has immersed his mother, Late Indira Devi gari ashes at Haridwar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ