Advertisementt

నా ఫెవరెట్ హీరో వెంకీ: బెల్లంకొండ గణేష్

Tue 04th Oct 2022 11:09 AM
bellamkonda ganesh,bellamkonda ganesh interview,swathi muthyam movie  నా ఫెవరెట్ హీరో వెంకీ: బెల్లంకొండ గణేష్
Bellamkonda Ganesh Interview నా ఫెవరెట్ హీరో వెంకీ: బెల్లంకొండ గణేష్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జున సినిమాలకు పోటీగా కుర్ర హీరో, డెబ్యూ హీరో బెల్లంకొండ గణేష్ తన సినిమాని రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆ నిర్మాతలకి ఎన్ని గట్స్ ఉండాలి, ఆ సినిమాపై ఎంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఇదే ప్రతి ఒక్క సినిమా లవర్ మదిలో మెదులుతున్న ప్రశ్న. గాడ్ ఫాదర్-ద ఘోస్ట్ లాంటి రెండు పెద్ద సినిమాలని ఓ చిన్న సినిమా ఢీ కొట్టడం మాములు విషయం కాదు. అందుకే అందరి నోళ్ళలో నానుతున్నాడు బెల్లంకొండ గణేష్. గణేష్ సిల్వర్ స్క్రీన్ కి హీరోగా పరిచయమవుతున్న స్వాతిముత్యం రేపు దసరా కానుకగా విడుదలకాబోతుంది. ప్రమోషన్స్ విషయంలోనూ పెద్ద హీరోలకి పోటీ ఇస్తున్న గణేష్.. తాజాగా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

నాకు ఈ సినిమా చేస్తుంటే నేను కొత్త హీరో అని ఫీల్ అవ్వలేదు. నాన్నకు(బెల్లంకొండ సురేష్) కూడా కధ నచ్చింది కాబట్టి ఈ సినిమా చేసాను. బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.. సినిమా బాగుంటానికి బడ్జెట్ కారణం కాదు.. చిరంజీవి, నాగార్జున లాంటి పెద్ద స్టార్స్ పక్కన నా సినిమా పోస్టర్ చూచుకుంటే చాలా ఆనందంగా వుంది, నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. షూటింగ్ అంతా సరదాగా గడిచిపోయింది అని చెప్పిన గణేష్.. తన ఫెవరెట్ హీరో దగ్గుబాటి వెంకటేష్ అని చెప్పాడు. మరి ఈ కుర్ర హీరో తన మొదటి సినిమా స్వాతిముత్యంతో సక్సెస్ సాధించాలని కోరుకుందాం.

Bellamkonda Ganesh Interview:

Bellamkonda Ganesh Interview about Swathi Muthyam movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ