అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ద ఘోస్ట్ నేడు దసరా పండగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్, సిస్టర్ సెంటిమెంట్ తో భారీ అంచనాలు, భారీ ప్రమోషన్స్ తో విడుదలయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఘోస్ట్ ప్రీమియర్లు పూర్తికావడంతో ఓవర్సీస్ ప్రేక్షకులు ఘోస్ట్ మూవీ ఎలా ఉందొ సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఆడియన్స్ ఇస్తున్న టాక్ లోకి వెళితే.. నాగార్జున ఫ్రెష్ లుక్స్ తో కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో కనిపించారని, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా ది ఘోస్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు డిజైన్ చేశారని చెబుతున్నారు. నాగార్జునను కొత్తగా ఇంటర్ పోల్ ఆఫిసర్ గా డిఫరెంట్‌గా చూపించారని.. ఇది మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దసరా విన్నర్ అంటూ కొంతమంది అక్కినేని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
స్క్రీన్‌ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్, టేకింగ్ చాలా బాగున్నాయి. సెకండాఫ్ సూపర్‌గా ఉందని.. యాక్షన్ బ్లాక్స్ విజిల్స్ వేయించేవిలా ఉన్నాయని, నాగార్జున స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ సూపర్ అని, క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం పేలిపోయింది అని, ఖైదీ, విక్రమ్ సినిమాల్లా అదిరిపోయే క్లైమాక్స్‌ను ఘోస్ట్ లో ప్రవీణ్ సత్తారు డిజైన్ చేసాడు అని.. ఈ సినిమా శివ తర్వాత నాగ్ కి అంత పెద్ద హిట్ ఇవ్వడం పక్కా అంటూ ఓవర్సీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.