జబర్దస్త్ నుండి కొద్దిరోజులు దూరంగా ఉండి మళ్ళీ విమర్శలు చేస్తున్నవారికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతో హైపర్ ఆది జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ అంటే సూపర్ హిట్ అనేదిలా ఉండేది ఒకప్పుడు. పవర్ ఫుల్ పంచ్ లతో, కామెడీ ట్రాక్ తో ఆది కడుపుబ్బా నవ్వుంచేసాడు. ప్రతిసారి మిగతా టీమ్స్ మీద స్కిట్ కొట్టేవాడు. కానీ జబర్దస్త్ నుండి గ్యాప్ తీసుకున్నాక ఆదిలో ఫైర్ తగ్గింది అనిపిస్తుంది. పంచ్ ల్లో పవర్ లేదు. ఏదో నామ్ కా వాస్త్ అన్నట్టుగా హైపర్ ఆది స్కిట్స్ కనిపిస్తున్నాయి.
ఆది రైజింగ్ రాజు తో కలిసి కామెడీ చేస్తున్నా మునుపటి జోష్ ఆదిలోను మిస్ అవుతుంది. అటు జోష్ లేదు, ఇటు కామెడీ లేదు అన్నట్టుగా తయారయ్యాయి ఆది స్కిట్స్. గతంలో ఆది జబర్దస్త్ స్టేజ్ ఎక్కాడంటే స్కిట్ మొత్తం కామెడీ, పంచ్ లు అన్నట్టు హుషారుగా ఉండేది. కానీ రీ ఎంట్రీ తర్వాత ఆ కామెడీ లేదు, ఆ జోష్ లేదు అంటూ ఆడియన్స్ వాపోతున్నారు. మరి మళ్ళీ ఆది ఫామ్ లోకి రావాలంటే కాస్త గట్టిగా కామెడీ చెయ్యాల్సిందే.