యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫ్యాన్ షణ్ముఖ్ కి సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉన్నప్పటికీ బిగ్ బాస్ లో సిరి తో చేసిన ఫ్రెండ్ షిప్ అతన్ని బాగా డీ ఫేమ్ చేసింది. కోటి మంది అభిమానులతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ పై అభిమానం యూత్ లో క్రేజీ గా మారింది. బిగ్ బాస్ లో టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన షణ్ముఖ్ కి సిరి ఫ్రెండ్ షిప్ విన్నర్ ని కాస్తా రన్నర్ అయ్యేలా చేసింది. బిగ్ బాస్ ద్వారా భారీగా పారితోషకం అందుకున్న షణ్ముఖ్ అక్కడినుండి బయటికి వచ్చాక ఏజెంట్ వెబ్ సీరీస్ చేసాడు,
అయితే తాజాగా షణ్ముఖ్ ఓ కాస్ట్లీ కారు కొన్నాడు. తనకి ఎంతో ఇష్టమైన బిఎండబ్ల్యూ బ్రాండ్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారు కి సంబందించిన ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ కారు ధర ఇండియన్ మార్కెట్లో ఆన్ రోడ్ ప్రైస్ టాప్ మోడల్ అయితే 44.5 లక్షలు ఉండొచ్చు. నా డ్రీమ్స్ లో ఇది ఒక డ్రీమ్. నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఈ పొజిషన్లో చూడాలి అనుకున్నది మీరే అని ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పాడు. నా ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా చాలామంది ఈ విజయంలో నాకు తోడ్పాటు అందించారు. ఇది మన కారంటూ ఎప్పుడు కనిపించిన కూడా చెప్పండి లిఫ్ట్ మాత్రం పక్కా ఇస్తాను అంటూ ట్విస్ట్ కూడా ఇచ్చాడు. షణ్ముఖ్ గతంలో ఓ కారు యాక్సిడెంట్ లో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.