సీత రామం తో సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. హిందీలోనూ ప్రూవ్ చేసుకుంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ బ్యూటీగా పలు సీరియల్స్ లోను, యాడ్స్ లోను నటించిన మృణాల్ ఠాకూర్ కి హిందీలో చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అదే విషయం మృణాల్ కూడా చెబుతుంది. తనని నమ్మి ఏ ఒక్క దర్శకుడు తనకి అవకాశాలు ఇవ్వలేదని, హిందీలో సీత రామం లాంటి ఆఫర్ రాలేదని, తాను బాగా నటిస్తాను అని హిందీ దర్శకులని నమ్మించడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ తనకి అవకాశాలు రాలేదు అని చెబుతుంది. కానీ తనకి వచ్చిన అవకాశాలతో హ్యాపీగానే ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. కొంతమంది దర్శకులు తనకి తగ్గ పాత్రలు సృష్టిసున్నారు అని చెప్పింది.
అయితే చాలామంది నీ వయసెంత అని అడుగుతూన్నారు, నేను 30 ఏళ్ళు అని చెప్పగానే తనని పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తున్నారని, అలాంటి వాళ్లకి బై చెప్పేసి వెళ్ళిపోతున్నట్టుగా కామెంట్స్ చేసింది మృణాల్ ఠాకూర్. సీత రామం లో అచ్చమైన తెలుగమ్మాయిలా, సీత గా ఆమె లుక్స్, పెరఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఆతర్వాత ఆమెకి సౌత్ మూవీస్ లో ఛాన్సులు కూడా వస్తున్నాయి.