ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ దసరా రోజున విడుదలైంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ తో పోటీ పడుతున్న నాగ్ మన జోనర్ వేరు, వాళ్ళ జోనర్ వేరు అందుకే ఈ పోటీ అన్నారు. అన్నట్టుగానే గాడ్ ఫాదర్ పొలిటికల్ గా హిట్ అయ్యి కూర్చుంది.. నాగార్జున ఘోస్ట్ కి కూడా మంచి టాక్ వచ్చింది. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయ్ అన్నారు. కానీ ఆడియన్స్ మాత్రం ఘోస్ట్ మూవీని రిజెక్ట్ చేసినట్టే కనిపిస్తుంది. అటు నాగార్జున ఘోస్ట్ థియేటర్స్ కూడా చిరు గాడ్ ఫాదర్ కోసం కేటాయిస్తున్నారని తెలుస్తుంది. అలాగే మొదటి రోజు పర్లేదనిపించిన కలెక్షన్స్ రెండో రోజు దారుణం గా పడిపోయాయి.
మొదట రోజు రెండు కోట్లకి పైగా వసూలు చేసిన ఘోస్ట్ రెండో రోజు లక్షల్లోకి పడిపోయింది. రెండోరోజు ఘోస్ట్ కలెక్షన్స్ చూస్తే.. ఆడియన్స్ ఘోస్ట్ ని లైట్ తీసుకున్నారనిపించకమానదు. ఈ సినిమా ఒక డిజాస్టర్ అని ట్రేడ్ అనలిస్టులు కూడా చెపుతున్నారు. రెండు రోజుల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఈరోజు ఘోస్ట్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ 20 నుండి 30 శాతం మాత్రం ఉంది అంటున్నారు. ద ఘోస్ట్ ఇంతగా విఫలవడానికి కారణం.. స్టోరీలో కంటెంట్ లేకపోవడమే అంటున్నారు. మరి యాక్షన్ ప్రియులకి మాత్రమే ఈ మూవీ ఎక్కుతుంది... కానీ ఎక్కువగా గాడ్ ఫాదర్ కి ఇంపోర్టన్స్ ఇస్తున్నారు ఆడియన్స్.