బిగ్ బాస్ గత సీజన్స్ నుండి బిగ్ బాస్ లీకులు యాజమాన్యానికి నిద్ర పట్టనివ్వడం లేదు. ఎంతగా కట్టడి చేసిన బిగ్ బాస్ లీకులు మాత్రం ఆగడం లేదు. మొదటి సీజన్ లో ఎలా ఉన్నా.. రెండో సీజన్ నుండే ఈ లీకుల బెడద ఎక్కువైంది. సండే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ముందు రోజే అంటే శనివారమే లీకైపోయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం ఎపిసోడ్ శనివారమే షూట్ జరగడంతో ఆ ఎపిసోడ్ లీకుల ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఇక గత నాలుగు వారాలుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ముందే లీకైపోయి బయటికి వచ్చినట్టుగా ఈ వారమే ఎవరు ఎలిమినేట్ అయ్యిందో ఈ రోజే తెలిసిపోయింది. మరి లీకులు ఎప్పుడూ నిజాలే అయ్యాయి. అంటే ఈవారం ఎలిమినేషన్ కూడా నిజమే అయ్యుంటుంది. కాకపోతే ఈ ఎలిమినేషన్ మాత్రం అందరికి షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి.
ఈ సీజన్ లోకి పాపులర్ షో జబర్దస్త్ నుండి హౌస్ లోకి ఎంటర్ అయిన చంటి, ఫైమాలు ఉన్నారు. ఫైమా ఎంటర్టైన్మెంట్ తో పాటుగా, టాస్క్ పరంగా గట్టి పోటీ ఇస్తుంటే.. చంటి మాత్రం పెద్దమనిషిలా వ్యవహరిస్తున్నాడు. టాస్క్ ల్లో చాలా స్లోగా ఉండే చంటి సీక్రెట్ టాస్క్ ఓడిపోవడం అందరిలో మరింత వీక్ చేసింది. అలాగే గీతు కూడా చంటి ని ఎగతాళిగా మాట్లాడుతుంది. టాస్క్ ఆడవు, జబర్దస్త్ కామెడీ చేస్తే సరిపోతుందా అనేది. అయితే ఈ వారం సెల్ఫ్ నామినేషన్ లో భాగంగా చంటి నామినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళ లో ఆదిరెడ్డి, మరీనా డేంజర్ జోన్ లో ఉండగా.. సేఫ్ జోన్ లో ఉన్నాడనుకున్న చంటి ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు బయట పెట్టాయి. మరి వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఈ వారం చంటినే ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది.