Advertisementt

బిగ్ బాస్ 6: ఇనాయ కోసం ఏడ్చేసిన సూర్య

Sun 09th Oct 2022 10:36 PM
bigg boss 6,chanti,inaya,surya  బిగ్ బాస్ 6: ఇనాయ కోసం ఏడ్చేసిన సూర్య
Bigg Boss 6: Surya cried for Inaya బిగ్ బాస్ 6: ఇనాయ కోసం ఏడ్చేసిన సూర్య
Advertisement
Ads by CJ

ఈరోజు ఆదివారం ఎవరో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన రోజు. చలాకి చంటి బిగ్ బాస్ హౌస్ నుండి ఐదో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన విషయం నిన్న శనివారమే లీకుల ద్వారా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసింది. అందుకే చంటి ఎలిమినేట్ అవుతాడని ముందే తెలిసిన ఆడియన్స్ కామ్ గా ఉన్నారు. కానీ హౌస్ మేట్స్ లో మాత్రం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియక చాలా కంగారు పడిపోయారు. చివరిలో చంటి కానీ, ఇనాయ కానీ ఎలిమినేట్ అవుతారు అనుకున్న సమయంలో హౌస్ మొత్తం డల్ గా మారిపోయింది. ముఖ్యంగా సూర్య అయితే వెక్కి వెక్కి ఏడ్చేశాడు.

ఇనాయ వెళ్లిపోతుందేమో అని ఆటను చాలా ఫీలయ్యాడు. తాను ఎవరికి దగ్గరైనా అందరూ హౌస్ నుండి వెళ్ళిపోతున్నారంటూ తెగ ఫీలైపోయాడు. ఆరోహి వెళ్ళిపోయింది, ఇప్పడు ఇనాయ కానీ చంటి అన్న కానీ ఎవరు వెళ్లినా తనకి బాదే అంటూ ఏడ్చేశారు. ఇనాయ వచ్చి హగ్గులు ఇచ్చినా సూర్య ఏడుస్తూనే ఉన్నాడు. వెక్కి వెక్కి కాదు, గుక్కపట్టి ఏడ్చేశాడు. ఇక ఫైనల్ గా చంటి ఎలిమినేట్ అయ్యాడని తెలిసి హౌస్ లో ఉన్న ఫైమా, రాజ్, సూర్య, బాలాదిత్య ఇలా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అతన్ని పంపేటప్పుడు హౌస్ మొత్తం ఎమోషనల్ అయ్యింది. 

Bigg Boss 6: Surya cried for Inaya:

Chanti gets eliminated from Bigg Boss Telugu 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ