Advertisementt

బాలయ్య చేతిలో బాబుగారు ఇరుక్కున్నారు

Tue 11th Oct 2022 07:54 PM
unstoppable 2,balakrishna,cbn  బాలయ్య చేతిలో బాబుగారు ఇరుక్కున్నారు
Unstoppable with NBK Season 2 Episode 1 Promo బాలయ్య చేతిలో బాబుగారు ఇరుక్కున్నారు
Advertisement
Ads by CJ

అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ మాములుగా కాదు, దడదడ లాడించడమే. ఏ సినిమా సెలెబ్రిటీ అయితేనో ఆ క్యూరియాసిటీ వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పొలిటికల్ బ్యాగ్డ్రాప్ ఉన్న ఓ లీడర్, మాజీ సీఎం ఆయన కొడుకుతో, అది కూడా హోస్ట్ బాలకృష్ణ బావగారు, ఆయన అల్లుడు తో టాక్ షో అంటే దద్దరిల్లిపోవాలా.. అదే జరిగింది ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పైన. బైక్ పై స్టైలిష్ గా దిగిన నందమూరి నట సింహం.. సీజన్ 2 ని గ్రాండ్ గా మొదలు పెట్టేసారు. ఈ షోలో నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ తో బాలకృష్ణ తన వాక్చాతుర్యంతో ఓ ఆట ఆడుకున్నారనుకుంటే పొరబాటే.. ఎందుకంటే చంద్రబాబు నాయుడే బాలయ్యని బంతాట ఆడేసారు. 

హుందాగా స్టేజ్ పైకి చంద్రబాబుని ఇన్వైట్ చేసిన బాలయ్య బావగారు రాగానే.. అటు ఫ్యామిలీ విషయాలు, ఇటు పొలిటికల్ విషయాలే కాదు, ఆయన పర్సనల్ విషయాలను కెలికారు. చంద్రబాబు కూడా తనలోని మరో కోణాన్ని ఈ టాక్ షో లో చూపించారు. ఇక లోకేష్ కూడా ఈ ఎపిసోడ్ మిడిల్ లో ఎంటర్ అవ్వగా.. మావ బాలయ్యని హోస్ట్ ప్లేస్ ఖాళీ చేయించేసాడు. లోకేష్ ని కూడా పొలిటికల్ గా పోటీ చేసి ఓడిపోయిన దగ్గరనుండి, బ్రాహ్మణిని వివాహం చేసుకోవడం, అలాగే ఫ్యామిలిలో ఇంట్రెస్టింగ్ విషయాలతో రేపు 14 న రాబోయే ఎపిసోడ్ పై ఈ ప్రోమోతో భీభత్సమైన క్యూరియాసిటీ కలిగించారు. చంద్రబాబు నాయుడు-రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్ షిప్ విషయాలు కూడా ఈ ఎపిసోడ్ లో బయటపెట్టబోతున్నట్టుగా ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. టాక్ షో లకే అమ్మమొగుడు అంటూ బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కి నందమూరి ఫాన్స్ కి పూనకాలే. మరి ఈ ప్రోమో చూసాక ఆ ఎపిసోడ్ పై మరింతగా ఆత్రుత, అంచనాలు పెరిగిపోతున్నాయి.

Unstoppable with NBK Season 2 Episode 1 Promo:

Unstoppable 2 promo of Balakrishna with CBN out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ