గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లో ఉండడానికి అర్హత లేని వారు నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి కొద్దిగా క్రేజ్, బాగా ఆడి, ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. నేహా చౌదరి విషయంలో అదే జరిగింది, రీసెంట్ గా చంటి విషయంలో అలానే జరిగింది. రాజ్, వాసంతి, సుదీప లాంటి వాళ్ళు హౌస్ లో ఉన్నారు. వీరికి గేమ్ రాదు, ఎంటర్టైన్మెంట్ తెలియదు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో శ్రీహన్ ఓటింగ్ పరంగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా.. రెండు వారాలుగా గట్టిపోటీ ఇస్తున్న కీర్తి సెకండ్ ప్లేస్ కి వచ్చేసింది. తర్వాత అనూహ్యంగా ఆదిరెడ్డి తన ఓటింగ్ ని పెంచుకుని మూడో స్థానంలోకి వచ్చేసాడు.
ఆ తర్వాత స్థానంలో గీతు ఉండగా.. తర్వాత ప్లేస్ లో మరీనా ఉంది. ఆరో స్థానాల్లో రాజ్ ఉండగా.. ఏదో స్థానంలో బాలాదిత్య, ఎనిమిదో స్థానంలో శ్రీసత్య ఉన్నారు. మొన్నటి వరకు శ్రీసత్య టాప్ 5 లోనే కొనసాగింది. కానీ ఆమె కి ఓటింగ్ శాతం బాగా తగ్గడంతో డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఇక ఎప్పటిలాగే అంటే గత నాలుగు వారాలుగా చివరి స్థానంలోనే కొనసాగుతూ.. ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటున్న సుదీప ఉంది. మరి కొన్ని వారాలుగా డేంజర్ జోన్ లోనే ఉండి.. ఎలా సేవ్ అవుతుందో తెలియక సతమతమవుతున్నారు ప్రేక్షకులు. వీక్ కంటెస్టెంట్ గా ఓటింగ్ లో చివరి స్థానంలో కొనసాగుతున్న సుదీప ఈసారి అయినా ఎలిమినేట్ అవుతుందో.. లేదంటే లక్కీగా సేవ్ అవుతుందో చూడాలి.