Advertisementt

సర్జరీ చేయించా.. తప్పేముంది: శృతి

Tue 18th Oct 2022 11:18 AM
shruti haasan,nose surgery,prabhas,chiranjeevi,balakrishna,shruti haasan heroine  సర్జరీ చేయించా.. తప్పేముంది: శృతి
Shruti Haasan Clarity on Nose Surgery సర్జరీ చేయించా.. తప్పేముంది: శృతి
Advertisement
Ads by CJ

‘‘నేను సర్జరీ చేయించుకున్నా.. అందులో తప్పేముంది. అయితే మీరనుకున్నట్లుగా నేను సర్జరీ చేయించుకోలేదు. గాయం కారణంగానే సర్జరీ చేయించుకున్నాను’’ అని తన నోస్ (ముక్కు) సర్జరీపై శృతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. ఆ మధ్య ప్రేమ అంటూ సినిమాలు మానేసి షికార్లు కొట్టిన శృతిహాసన్.. ఆ ప్రేమ వికటించడంతో.. మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. రీఎంట్రీలో ఆమె స్టార్ హీరోల చిత్రాలతో బిజీబిజీగా ఉంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన నోస్ సర్జరీ గురించి చెప్పుకొచ్చింది. నాకు సర్జరీ జరిగిందని, చేయించుకున్నానని చెప్పడానికి సిగ్గు పడటం లేదు.. అంటూ ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

‘‘నేను హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో నోస్ చాలా పెద్దదిగా ఉందనేలా కామెంట్స్ వినిపించాయి. అది నిజమే. ఆ తర్వాత నా సినిమాలలో నోస్‌పై కామెంట్స్ వినబడలేదు. అందుకు కారణం సర్జరీనే. అయితే అంతా అనుకుంటున్నట్లుగా నేను నా నోస్ చిన్నగా కనిపించాలని సర్జరీ చేయించుకోలేదు. ఆ సమయంలోనే నా నోస్‌కు గాయమైంది. తప్పనిసరిగా డాక్టర్స్ సర్జరీ చేయాలని అన్నారు. అంతే తప్ప.. నేను కావాలని సర్జరీ చేయించుకోలేదు’’ అని శృతిహాసన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అది విషయం. ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోల సరసన నటిస్తోంది.

Shruti Haasan Clarity on Nose Surgery:

Shruti Haasan Talks about Her Nose Surgery 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ