Advertisementt

అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి ప్రభాస్

Thu 13th Oct 2022 09:47 PM
prabhas,kantara movie,prasad labs  అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి ప్రభాస్
What is this special interest, Prabhas అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి ప్రభాస్
Advertisement
Ads by CJ

కన్నడ లో రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ పై ప్రభాస్ ఇన్స్టా వేదికగా స్పందించడం తో తెలుగు ప్రేక్షకుల చూపు ఆటోమాటిక్ గా ఆ సినిమాపై పడింది. కన్నడ నుండి వచ్చిన KGF తర్వాత అంతటి సంచలనాన్ని కాంతారా క్రియేట్ చేసింది. కన్నడలో రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ సినిమాని తెలుగులో గీత ఆర్ట్స్ ద్వారా అల్లు అరవింద్ డబ్బింగ్ హక్కులని దక్కించుకుని.. ఇక్కడ కూడా ప్రమోట్ చేసి రేపు 15 న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. దానితో అందరి చూపు ఆ సినిమాపైనే ఉంది.

ఈలోపు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ప్రభాస్ ప్రత్యేకంగా ఈ రోజు గురువారం సాయంత్రం కాంతారా స్పెషల్ షో వేయించుకుని వీక్షించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. దానితో ప్రభాస్.. ఏంటి ఆ సినిమాపై అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంతో బిజీగా వున్న ప్రభాస్.. ఇలా ఆ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం వలన ఆ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు . ప్రభాస్ తో పాటుగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా కాంతారా మూవీని ప్రసాద్ లాబ్స్ లో వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. 

What is this special interest, Prabhas :

Prabhas watch Kantara in prasad labs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ