బిగ్ బాస్ సీజన్ 6 ఆరోవారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. కారణం ఓటింగ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కనిపిస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న తొమ్మిది మంది లో ఇనాయా, మెరీనా, బాలాదిత్య, శ్రీహాన్, రాజశేఖర్, శ్రీ సత్య, ఆది రెడ్డి, సుదీప, గీతూ లు ఉన్నారు. వీరిలో మొదటి రోజునుండి ఓటింగ్ లో శ్రీహన్ టాప్ లో ఉన్నట్లుగా ఓటింగ్స్ పోల్స్ చెబుతున్నాయి. తర్వాత స్థానంలో నిన్నటివరకు కీర్తి కొనసాగితే.. ఈరోజు మాత్రం సెకండ్ ప్లేస్ లోకి ఆది రెడ్డి వచ్చేసినట్లే తెలుస్తుంది. అతనికి అతని భార్య కవిత తో మాట్లాడిన వీడియో కాల్ హెల్ప్ చేసింది అంటున్నారు. ఇక మూడో స్థానానికి కీర్తి పడిపోయింది. తర్వాత స్థానాల్లో రాజ్, గీతు ఉండగా.. ఇప్పుడు గీతు నాలుగో స్థానంలో, ఐదో స్థానంలోకి శ్రీసత్య వచ్చేసారు. ఎనిమిదో స్థానంలో డేంజర్ జోన్ లో ఉన్న శ్రీసత్య అనూహ్యంగా ఐదో స్థానానికి వచ్చేసింది.
ఓటింగ్ లో ఉన్న ట్విస్ట్ లు బట్టి ఏడోస్థానాలో ఉన్న బాలాదిత్య ఆరో స్థానంలో కి రాగా.. నాలుగో స్థానాల్లో కొనసాగిన రాజ్ ఏదో స్థానంలోకి పడిపోయాడు. ఇక డేంజర్ జోన్ లో ఎప్పటిలాగే సుదీప, మరీనా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వారంలో సుదీప కానీ, మరీనా కానీ హౌస్ నుండి వెళ్లిపోయే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి సుదీప కొన్నివారాలుగా డేంజర్ జోన్ లోకి వస్తున్నా అదృష్టం బావుండి సేవ్ అవుతూ వస్తుంది. కాని ఈసారి పక్కా ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తుంది ఓటింగ్ ని చూస్తుంటే..