Advertisementt

బిగ్ బాస్: కొత్త కెప్టెన్ సూర్య.. ఎలిమినేట్ అయ్యేది

Sat 15th Oct 2022 10:31 AM
rj surya,bigg boss,bigg boss telugu 6  బిగ్ బాస్: కొత్త కెప్టెన్ సూర్య.. ఎలిమినేట్ అయ్యేది
Bigg boss 6: Rj Surya Is Become New Captain బిగ్ బాస్: కొత్త కెప్టెన్ సూర్య.. ఎలిమినేట్ అయ్యేది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఆరో కెప్టెన్ గా హౌస్ మేట్స్ మద్దతు, అతను బలంతో ఆర్జే సూర్య నిలిచాడు. ఆరోహి తో బాండింగ్ పెట్టుకుని గేమ్ మీద ఫోకస్ పెట్టని సూర్య.. ఆమె వెళ్ళగానే ఇనయతో ఫ్రెండ్ షిప్ కాదు, కంటెంట్ కోసం లవ్ ట్రాక్ స్టార్ట్ చేసాడు. అటు ఇనాయ కూడా గేమ్ మీద ఫోకస్ పెట్టడం అటుంచి ఆమె సూర్య మీద ఫోకస్ పెట్టి అనుక్షణం అతనితో కలిసి ఉండేలా చూసుకుంటుంది. సూర్య-ఇనాయ కలిసి ముద్దులు, హగ్గులు అంటూ చెలరేగిపోతున్నారు. ఇక హౌస్ కెప్టెన్ గా అందరి సహకారముతో సూర్య బాధ్యతలు తీసుకోగానే.. నేను అందరిని కలుపుకుపోతా అన్నాడు.

ఇక ఈ వారం తొమ్మిదిమంది నామినేషన్స్ లో ఉండగా.. అందులో శ్రీహన్ స్ట్రాంగ్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. తర్వాత ప్లేస్ లో యూట్యూబర్ ఆదిరెడ్డి, కీర్తి, గీతు ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో శ్రీసత్య, బాలాదిత్య, మరీనా ఉన్నారు. ఈ వారం ఓటింగ్ లో ట్విస్ట్ లతో డేంజర్ జోన్ లోకి చివరికి అంటే ఓటింగ్ ముగిసే సమయానికి సుదీప-రాజ్ లు వచ్చారు. ఈ వారం ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ రోజు నైట్ 9 గంటలకల్లా తేలిపోతుంది. మరి ఈ ఆరోవారం నాగార్జున హౌస్ నుండి ఎవరిని ఎలిమినేట్ చేస్తారో చూడాలి. 

Bigg boss 6: Rj Surya Is Become New Captain:

Rj Surya Bigg Boss 6 new Captain

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ