నారా చంద్రబాబు నాయుడు-బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై పెట్టిన టాక్ షో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి గుండెల్లో మంట రాజేసింది. వైసిపి నాయకులు కొడాలి నాని లాంటి వాళ్ళు బాలయ్యని, చంద్రబాబుని తీవ్ర పదజాలంతో దూషిస్తే.. ఇప్పుడు లక్ష్మి పార్వతి అయితే ఏకంగా బాలకృష్ణ ని చూస్తుంటే ఫస్ట్ టైం అసహ్యం వేస్తుంది అని, అసలు ఆయన ఎన్టీఆర్ కొడుకేనా అన్నంతగా జుగుప్స కలుగుతోంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో 1995 లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై అటు చంద్రబాబు ఇటు బాలకృష్ణ లు ఓపెన్ అయ్యారు. అక్కడ చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా ఎన్టీఆర్ విననందునే అలాంటి పని చేశామని, ఇది ఫ్యామిలీ డెసిషన్ అని, అందరం కలిసి తీసుకున్న నిర్ణయమంటూ అప్పట్లో ఎన్టీఆర్ చేసింది తప్పు, ఓ వ్యక్తి వలన ఆయన ఇంఫ్లూయెన్స్ అయ్యారంటూ బావాబావమరుదులు ఓపెన్ గా మట్లాడడం పట్ల లక్ష్మి పార్వతి స్పందించింది.
చంద్రబాబు పరమ దుర్మార్గుడు, 1995 లో ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నానని చెప్పింది అబద్దం, అప్పట్లో చంద్రబాబు 40 నుండి 50 ఎమ్యెల్యేలను కొనేసినట్టుగా ఎన్టీఆర్ నాతో చెప్పారు. చంద్రబాబుకి దాసరి, చిరు సహాయం చేసారు. మా పెళ్లితో తెలుగు దేశం ఓడిపోతుంది అని చంద్రబాబు ప్రచారం చేయించారు. చంద్రబాబు ఎమ్యెల్యేలని రెచ్చగొట్టడం, చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్ ని చంపేసింది. పార్టీలో నేను ఎన్టీఆర్ ని ఇబ్బంది పెడితే ఆయన ఫ్యామిలీని వదిలేసి నన్నెందుకు భరిస్తారు, సహిస్తారు. చంద్రబాబు ఓ దుర్మార్గుడు. ఇప్పటికీ నిజం చెప్పాలన్న మానవత్వం లేదు.
బావాబావమరుదులు కలిసి డ్రామా చేస్తున్నారు. బాలయ్య అంటే అభిమానం ఉండేది. కానీ బాలయ్య మీద మొదటిసారి పరమ అసహ్యం వేస్తోంది. ఆయన అసలు ఎన్టీఆర్ కొడుకేనా అన్నంతగా జుగుప్సా కలుగుతోంది. బాలకృష్ణకి చాలా సాయం చేశాను. బావను కాపాడటానికి బావమరిది రంగంలోకి దిగాడు. ఎన్నికలొస్తున్నాయి కదా ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు అంటూ లక్ష్మి పార్వతి బాలయ్యని కడిగిపారేసిం