Advertisementt

ఈ వారం థియేటర్స్-ఓటిటీలో జాతరే జాతర

Mon 17th Oct 2022 05:54 PM
ginna movie,ori devuda movie,bimbisara  ఈ వారం థియేటర్స్-ఓటిటీలో జాతరే జాతర
October 21st OTT and Theater release list ఈ వారం థియేటర్స్-ఓటిటీలో జాతరే జాతర
Advertisement
Ads by CJ

ఈ వారం దివాళి రిలీజ్ లు అంటూ హడావిడి మొదలైంది. అందులో మంచు విష్ణు చాలా రోజుల తర్వాత జిన్నా మూవీ ని దివాళి బరిలో నిలుపుతున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్టయిల్లో రిలీజ్ చెయ్యడంతో ప్రమోషన్స్ తో మంచి ఊపుమీదున్నాడు. శుక్రవారం అక్టోబర్ 21 న జిన్నా రిలీజ్ కాబోతుంది. మరోపక్క సీనియర్ హీరో వెంకటేష్ కుర్ర హీరో విశ్వక్ సేన్ తో కలిసి ఓరి దేవుడా అంటూ అదేరోజు ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఇంత ఇంట్రెస్టింగ్ ఫైట్ లో మరికొన్ని చిన్న సినిమాల రిలీజ్ లు కూడా ఉన్నాయి. ఇక తమిళ నుండి కార్తీ సర్ధార్ డబ్బింగ్ చిత్రం కూడా శుక్రవారమే విడుదల కాబోతుంది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో బైలింగువల్ మూవీ తెలుగు, తమిళ్ లో తెరకెక్కించిన ప్రిన్స్ కూడా దివాళి బరిలో నిలబోతుంది. థియేటర్స్ లోనే ఇంత ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంది అంటే..

ఈ వారం ఓటిటి రిలీజ్ ల్లో కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఫైట్ కనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి హిట్ అనిపించుకున్న కళ్యాణ్ రామ్ బింబిసార జీ 5 ఓటిటి నుండి అక్టోబర్ 21 న రిలీజ్ కి రెడీ అయితే.. శర్వానంద్ హిట్ చిత్రం ఒకే ఒక జీవితం అదే రోజు సోని LIV నుండి రిలీజ్ కాబోతుంది. అలాగే నవీన్ చంద్ర అమ్ము కూడా ఈవారమే అక్టోబర్ 19 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. సో ఈ వారం దివాళి రిలీజ్ లతో ప్రేక్షకులకి పండగే పండగన్నమాట. 

October 21st OTT and Theater release list:

This Week New OTT Releases in Theaters Releases

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ