Advertisementt

నెల తిరక్కుండానే.. ఓటిటిలోకి స్వాతి ముత్యం

Wed 19th Oct 2022 09:30 AM
swathi muthyam,aha ott,bellamkonda ganesh  నెల తిరక్కుండానే.. ఓటిటిలోకి స్వాతి ముత్యం
Swathi Muthyam locks its OTT release date నెల తిరక్కుండానే.. ఓటిటిలోకి స్వాతి ముత్యం
Advertisement
Ads by CJ

బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ స్వాతి ముత్యం.. గాడ్ ఫాదర్-ఘోస్ట్ చిత్రాల మధ్యలో నలిగిపోయింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5 న రిలీజ్ అయిన స్వాతి ముత్యం సింగిల్ గా వస్తే సూపర్ హిట్ అయ్యేది. కానీ చిరు-నాగ్ తో పెట్టుకుని గణేష్ ఇబ్బందిపడిపోయాడు. గాడ్ ఫాదర్ కి హిట్ టాక్ పడడంతో స్వాతి ముత్యం వెనుకబడిపోయింది. స్వాతి ముత్యం బావుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్రిటిక్స్, ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పినా.. ప్రేక్షకులు ఎవరూ ఆ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్  చూపించలేదు. రాంగ్ టైం లో విడుదల చేసి నిర్మాతలు దెబ్బైపోయారు. లేదంటే స్వాతి ముత్యం మంచి మూవీగా గణేష్ కి డెబ్యూ మూవీ గా మిగిలిపోయేది.

అయితే అక్టోబర్ 5 న థియేటర్స్ లో రిలీజ్ అయిన స్వాతి ముత్యం అప్పుడే ఓటిటి రిలీజ్ కి రెడీ అయ్యింది. గణేష్-వర్ష బొల్లమ్మ కలయికలో తెరకెక్కిన స్వాతి ముత్యం ఓటిటి పార్ట్నర్ ఆహా అని ఎప్పుడో వెల్లడించాం. ఇప్పుడు ఆహా లో స్వాతి ముత్యం రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. నెలతిరక్కుండానే స్వాతిముత్యం ఈ నెల 28 న స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లుగా ప్రకటించారు. మరి థియేటర్స్ లో లైట్ తీసుకున్న స్వాతిముత్యానికి ఓటిటిలో మంచి రెస్పాన్స్ రావడం అయితే ఖాయం.

Swathi Muthyam locks its OTT release date:

Swathi Muthyam locks its OTT release date and time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ