ప్రముఖ తార సమంత, నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత వెండితెర పై అప్రహితంగా తారాపధంలో దూసుకుపోవడానికి ప్రణాళికలు రచించింది. తాను నటిస్తున్న శాకుంతలం కాకుండా, తమిళ దర్శకద్వయం హరి మరియు హరీష్ దర్శకత్వం లో యశోద అనే చిత్రంలో నటిస్తోంది. అది కాకుండా సమంత, ఫామిలీ మాన్ దర్సక దర్శక రాజ్-డీకే లతో కలిసి మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది.అంతే కాకుండా ఒక హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
సమంత యశోద చిత్రం నవంబర్ 11,2022 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర నిర్మాతలు విడుదల చేసిన ప్రచార చిత్రాలు, మరియు టీజర్ సినీ ప్రియులలో ఉత్కంఠ రేకెత్తిసొంది. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం సమంత ఈ చిత్రానికి ఎంతో హత్తుకుపోయింది. ఈ చిత్రం నిజ జీవిత సంఘటలనల ఆధారంగా రూపొందిస్తున్నారని, ఇందులో నమ్మశక్యం కానీ విషయాలు చూపిస్తారని తెలుస్తోంది. చిత్రంలో చూపించిన వాస్తవిక సంఘటనలు, సమంత జీవితంలో జరిగిన వాటికి పోలి ఉంటాయని, అందుకే హరి, హరీష్ లు సమంత కి కథ చెప్పగానే.. వెంటనే నటించడానికి ఒప్పుకొంది వినికిడి. సినిమాలో అతీంద్రియ మరియు థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి.