మెగా ఫ్యామిలిలో హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో లవ్ లో ఉన్నాడని, సాయి తేజ్ రెజీనా కసాండ్రతో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం ఎప్పటినుండో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ లు. ఎందుకంటే వీరు వారితో వరసగా సినిమాలు చేసారు కాబట్టి. ఇక ఇప్పుడు అల్లు శిరీష్ వంతు. అల్లు శిరీష్ కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని, అల్లు ఫ్యామిలిలో లుకలుకలు, అల్లు అర్జున్ ని స్టార్ హీరోని చేసావ్.. నన్ను వదిలేసావ్ అంటూ అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ పై ఫైట్ చేసి బెంగుళూరు వెళ్లిపోయాడంటూ ఏవేవో కథనాలు కనిపించాయి.
అవన్నీ అలా ఉంటే అల్లు శిరీష్ ఉర్వశివో రాక్షసీవో హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడనే న్యూస్ ఈ మధ్యన బాగా హైలెట్ అయ్యింది. కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్న అల్లు శిరీష్ ఉర్వశివో రాక్షసీవో చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న తరుణంలో అను ప్రేమ విషయంలో శిరీష్ తాజాగా స్పందించాడు. సెలబ్రిటీస్ పై ఇలాంటి వార్తలు రావడం సహజం. ఇంతకుముందు కూడా తనపై ఇలాంటి వార్తలొచ్చాయి. అను ఇమ్మాన్యువల్ కి తనకి మధ్యన ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది కానీ.. ఇంకెలాంటి ప్రేమ లేదని, మేమిద్దరం ఈ సినిమాకోసం కొన్ని నెలలు కలిసి పని చేశామని, మా ఇద్దరి మధ్యన మంచి అనుబంధం ఉంది, అలాగే మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి.. అను వర్క్ విషయంలో ప్రొఫెషనల్.. అందుకే రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు అస్సలు ఇబ్బంది పడలేదు అని చెప్పిన శిరీష్.. ఇలాంటి నెగెటివిటీని తీసుకోలేక రెండేళ్లుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.