బిగ్ బాస్ సీజన్ 6 ఏడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దానిపై బుల్లితెర ప్రేక్షకులులు ఎప్పుడో ఓ అంచనాకు వచ్చేసారు. గత వారం సుదీప ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం మాత్రం మరీనా-రాజ్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేలా ఉన్నాయి ఓటింగ్స్. ఈరోజు రాత్రి ఓటింగ్ పోల్స్ ముగిసేసరికి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది తేలిపోతుంది. అయితే ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి. సీజన్ 6 మొదలు పెట్టిన వారంలో ఎవరినీ ఎలిమినేట్ చెయ్యకుండా, రెండో వారంలో షాని, అభినయ ఇద్దరిని ఎలిమినేట్ చేసిపారేసి బిగ్ షాక్ ఇచ్చారు. ఇక ఈ ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని BB కేఫ్ లో అరియనా టాక్ షోలో సమీర్ చెప్పడం గమనార్హం.
సమీర్ BB కేఫ్ గెస్ట్ గా వచ్చి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అరియనా అడగగానే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని విన్నాను అని చెప్పాడు. అంతేకాకుండా శ్రీ సత్య చాలా తెలివైందని, అర్జున్ ఫైర్ కాదు ఫ్లవర్ అని, అలాగే ఇనాయ గురించి అభిప్రాయం చెప్పమంటే సమీర్ టక్కున ఇనాయ నామినేషన్స్ లోకి దిగగానే.. టివి మ్యూట్ లో పెడతాను అంటూ షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే మరీనా తో పాటుగా ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.