Advertisementt

బిగ్ బాస్ 6: వాసంతిని ఏడిపించేసారు

Fri 21st Oct 2022 01:55 PM
bigg boss 6,bigg boss telugu,vasanthi  బిగ్ బాస్ 6: వాసంతిని ఏడిపించేసారు
Bigg Boss 6: Housemates target Vasanthi బిగ్ బాస్ 6: వాసంతిని ఏడిపించేసారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఏడో వారంలో హౌస్ మేట్స్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వని కారణంగా కెప్టెన్సీ టాస్క్ రద్దు చెయ్యడమే కాకుండా, వాళ్ళ నుండి ఫుడ్ దొంగిలించేసి కడుపు కాల్చేశాడు బిగ్ బాస్. ఫుడ్ సంపాదించుకోవడానికి టాస్క్ ల్లో గెలవాలి, హౌస్ లో వుండాలంటే టాస్క్ ఆడాలంటూ కండిషన్ పెట్టడంతో గత రాత్రి పూల టాస్క్ లో ఒక్కొక్కరు రెచ్చిపోయి కొట్టేసుకుని, రక్కేసుకుని మరీ టాస్క్ ఆడేసారు. ఈ టాస్క్ లో ఎవరైతే తక్కువ ప్రదర్శన ఇస్తారో వారు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ గా నామినేట్ అవుతారనే మాట బిగ్ బాస్ చెప్పడంతో అందరూ రెచ్చిపోయారు. టాస్క్ లో శ్రీసత్య vs రేవంత్, రేవంత్ vs అర్జున్, అర్జున్ vs శ్రీహన్, మధ్యలో వాసంతి ఎవరినో కొట్టింది అంటూ గొడవ, మొత్తం మీద అంతా రచ్చ రచ్చ అయ్యింది.

అయితే ఈ టాస్క్ లో ఎవరు తక్కువ ఆడారో అనేదానికి మా టీమ్ లో రేవంత్ అని ఇనాయ అంటే.. గీతు అని శ్రీసత్య మాట్లాడుకున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో శ్రీసత్య టీం ఓడిపోగా.. అందులో వరెస్ట్ కంటెస్టెంట్ విషయంలో కొంతమంది గీతుని అంటే, కొంతమంది టీమ్ కెప్టెన్ గా శ్రీసత్య పర్ఫెక్ట్ కాదు అన్నారు. ఫైనల్ గా టాస్క్ ఆడినా, ఎంటర్టైన్మెంట్ విషయంలో వాసంతి వీక్ గా ఉంది అంటూ ఎక్కువ ఓట్స్ ఆమెకి పడ్డాయి. హౌస్ లో చాలామంది వాసంతినే టార్గెట్ చెయ్యడంతో ఆమె కోపంతో లేచి వెళ్ళిపోయి.. గేమ్ ఆడినా, ఎంటర్టైన్మెంట్ లేదు అని చివరిలో పడేస్తున్నారు. ఈమాత్రం దానికి ఆడకుండా కూర్చుంటే బెటర్ కదా అంటూ ఏడ్చేసిన ప్రోమో వైరల్ అయ్యింది.

Bigg Boss 6: Housemates target Vasanthi:

Bigg Boss 6: Today promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ