బాలకృష్ణ - గోపీచంద్ కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK107 టైటిల్ ని ఈ రోజు శుక్రవారం కర్నూల్ లో కొండా రెడ్డి బురుజు దగ్గర అభిమానుల కోలాహలం మధ్యన అంగరంగ వైభవం రివీల్ చేసారు మేకర్స్. NBK107 లో బాలయ్య పవర్ ఫుల్ లుక్ కి మ్యాచ్ అయ్యే మాస్ టైటిల్ వీర సింహ రెడ్డి గా బాలయ్య యాక్షన్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. కిలోమీటర్ మైలు రాయి మీద కాలు పెట్టి.. కత్తితో శత్రువులని గడగడలాడించిన లుక్ తో వీర సింహ రెడ్డిగా బాలయ్య వచ్చేసారు.
జై బాలయ్య.. జై బాలయ్య అంటూ కర్నూల్ ఈవెంట్ లో మాస్ ఫీవర్ తో ఊగిపోతున్న నందమూరి అభిమానులు ఇప్పుడు వీర సింహ రెడ్డి.. వీర సింహ రెడ్డి అంటూ రెచ్చిపోయి గోల గోల చేస్తున్నారు. ఈ టైటిల్ తో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.. బాలకృష్ణ వీర సింహా రెడ్డిని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం. ఇప్పటికే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి విడుదల అని ప్రకటించడం, అలాగే ప్రభాస్ ఆదిపురుష్, తమిళ్ హీరో విజయ్ వారసుడు.. బరిలో ఉన్న సంక్రాంతి టైమ్ కి బాలయ్య వీర సింహ రెడ్డి కూడా చేరడంతో సంక్రాంతి పోరు ఆసక్తికరమైన మలుపు తీసుకుంది.