Advertisementt

బిగ్ బాస్ 6: ఫైనల్లీ జైలుకి పంపారు

Fri 21st Oct 2022 10:43 PM
bigg boss 6,vasanthi,revanth  బిగ్ బాస్ 6: ఫైనల్లీ జైలుకి పంపారు
Bigg Boss 6: 7th week disaster contestant బిగ్ బాస్ 6: ఫైనల్లీ జైలుకి పంపారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఏడో వారం ముగిసి ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ వారం ఓటింగ్ లో నిన్నటివరకు రాజ్-మరీనాలు డేంజర్ జోన్ లో ఉంటే.. ఈరోజు వచ్చేసరికి మరీనా-శ్రీసత్య డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. ఓటింగ్ పరంగా ఈ వారం ఈ ఇద్దరి లో ఎవరో ఒకరు పక్కాగా ఎలిమినేట్ అవడం గ్యారెంటీగా కనబడుతుంటే.. మరోపక్క డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. అదలా ఉంటే ఈవారం జైలు కి వెళ్లే కంటెస్టెంట్ విషయంలో హౌస్ లో పెద్ద రచ్చే జరిగింది. ఎక్కువగా వాసంతి వీక్ అంటూ ఆమెని టార్గెట్ చేసారు. 

శ్రీసత్య ఓడిపోయిన గ్రూప్ లో ఉండి బిగ్ బాస్ ఇచ్చిన గ్లౌజ్ తీసుకుని గెలిచిన టీం నుండి స్వాప్ చేసుకోవాల్సిన అవకాశాన్ని కోల్పోయింది. దానితో శ్రీసత్య డిస్పాయింట్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్స్ విషయంలో శ్రీసత్య-అర్జున్ కి మధ్యన కొద్దిగా గొడవైంది. గీతు మాత్రం వాసంతి హాసిని లా కనిపించలేదు, ఆమె సరిగ్గా చెయ్యలేదు అంది. తర్వాత సూర్య కూడా వాసంతినే అన్నాడు. రాజ్ కి వాసంతికి ఈ విషయంలో ఫైట్ జరిగింది. అయితే హౌస్ లో ఎక్కువగా వాసంతి ని నామినేట్ చెయ్యడంతో ఆమె నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్స్ లోకి వెళ్ళింది.

ఇక ఈ వీక్ డిసాస్టర్ కంటెస్టెంట్ విషయంలో ఎక్కువగా రేవంత్ ని, మరీనా ని, వాసంతిని టార్గెట్ చేసింది హౌస్. వాసంతిని గీతు, సూర్య, రేవంత్, ఆది రెడ్డి డిసాస్టర్ టాగ్ ఇవ్వడంతో ఈవారం ఆమె జైలుకి వెళ్ళింది. గీతు వాసంతిని  జైల్లో పెట్టింది. ఇక వచ్చే వారం డైరెక్ట్ నామినేషన్, ఈ వారం డిసాస్టర్ కంటెస్టెంట్ గా వాసంతి నిలిచింది. 

Bigg Boss 6: 7th week disaster contestant:

Bigg Boss 6: Vasanthi sent to jail

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ