మంచు ఫ్యామిలీ చాన్నాళ్లుగా ఓ సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. మా అధ్యక్షుడిగా మెగా ఫ్యామిలీకి వ్యతిరేఖంగా జెండా ఎగరేసినా.. సినిమాల విషయంలో మాత్రం మంచు ఫ్యామిలీకి చుక్కెదురవుతుంది. అటు మంచు మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. ఇక మంచు లక్ష్మి ఏదో ట్రై చేస్తూనే ఉంటుంది కానీ విజయం దరి చేరడం లేదు. మరోపక్క మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా అంటూ చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి టైమ్ లో మంచు విష్ణు జిన్నా అంటూ హడావిడి మొదలు పెట్టాడు. మంచు ఫ్యామిలీపై ఉన్న నెగెటివిటి, వాళ్లపై అభిమానుల్లో ఉన్న నమ్మకం చూస్తే జిన్నా హిట్ అవదనే ఫిక్స్ అయ్యారు. విడుదల వరకు సినిమాకి బజ్ కూడా లేదు.
కానీ విష్ణు జిన్నా నిన్న శుక్రవారం విడుదలయ్యి మంచి టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు జిన్నాతో విష్ణు అన్న ట్రాక్ లోకి వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచు ఫ్యామిలీపై వచ్చే ట్రోలర్స్ కి జిన్నా సమాధానం అంటూ పబ్లిక్ థియేటర్స్ దగ్గర జిన్నా సినిమాపై రివ్యూస్ ఇస్తున్నారు. అటు క్రిటిక్స్ కూడా జిన్నాపై సూపర్ హిట్ రివ్యూస్ ఇవ్వకపోయినా.. సినిమా బావుంది అంటూ మంచి రివ్యూస్ ఇవ్వడంతో మంచు ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. గత రాత్రే జిన్నా సెలెబ్రేషన్స్ అంటూ కేక్ కటింగ్ ప్రోగ్రాం పెట్టింది టీం. ఇక ఈ దివాళిని మంచు ఫ్యామిలీ జిన్నా సక్సెస్ సెలెబ్రేషన్స్ తో అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఖాయంగా కనబడుతుంది.