బాలీవుడ్ కండల వీరుడు సినిమా షూటింగ్స్ మత్రమే కాదు, బిగ్ బాస్ హోస్ట్ గాను బాగా బిజీగా వున్న హీరో. అక్కడ టైగర్ 3 , ఇంకా కిసి కా భాయ్, కిసి కా జాన్ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ హెల్త్ ప్రోబ్లెంస్ వలన ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్స్ వాయిదా పడగా.. బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ స్థానంలో కరణ్ జోహార్ కనిపించడంపై ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే సల్మాన్ ఖాన్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, దానితో ఆయన రక్త పరిక్షలు చేయించుకోగా.. సల్మాన్ కి డెంగ్యూ ఫీవర్ అని తేలినట్లుగా తెలుస్తుంది.
దానితో రెండు వారాల పాటు ఖచ్చితంగా ఆయన రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పడంతోనే ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్స్ ని మేకర్స్ తాత్కాలికంగా వాయిదా వేశారు. అలాగే బిగ్ బాస్ హోస్ట్ గా ఈ వారం సల్మాన్ ప్లేస్ లోకి కరణ్ జోహార్ కనిపించబోతున్నారు. సల్మాన్ కోలుకునేవరకు కరణ్ జోహార్ బిగ్ బాస్ హోస్ట్ గా చెయ్యబోతున్నారు. అయితే సల్మాన్ త్వరగా డెంగ్యూ ఫీవర్ నుండి కోలుకోవాలంటూ ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు.